Begin typing your search above and press return to search.

విస్త‌ర‌ణే కాదు లోకేశ్‌ బెర్త్ కూడా ఖాయం

By:  Tupaki Desk   |   11 Jun 2016 12:01 PM IST
విస్త‌ర‌ణే కాదు లోకేశ్‌ బెర్త్ కూడా ఖాయం
X
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌రణ చేప‌ట్ట‌నున్నారా? కృష్ణా పుష్కరాల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణ జరపాలని ఆయ‌న నిర్ణ‌యించారా? పార్టీ యువ‌నేత నారా లోకేశ్‌ కు బెర్త్ ఖ‌రారు అయిందా? ఇందుకోసం స‌మీక‌ర‌ణాలు కూడా క‌లిసివ‌చ్చాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీపరంగా మహానాడు - మహాసంకల్ప దీక్షలు - ఈ నెలలో రాజధానికి పాలనావ్యవస్థ తరలింపుప్రక్రియ పూర్తిచేసి, ఆపై విస్తరణ అంశంపై సమాలోచనలు జరపనున్నట్లు తెలిసింది. ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కు పదవి ఇవ్వాలని ముఖ్యనేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

శాసనమండలి చైర్మన్ చక్రపాణి పదవీకాలం మరో ఏడాది ఉన్నందున ఈలోగా లోకేశ్‌ తోపాటు మరికొందరు కీలక నేతలను మండ‌లికి పంపే యోచనతో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం శాసనమండలిలో 58 మందికి గాను టీడీపీకి 38 మంది సభ్యుల బలం ఉంది. 2017 మార్చిలో 22 మంది ప‌ద‌వీ కాలం ముగిసిపోతుంది. దీంతో ఈ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో ఏడు సీట్లు ఎమ్మెల్యే కోటా - రెండుసీట్లు గవర్నర్ కోటాలోవి కాగా మిగిలినవి పట్ట‌భ‌ద్రులు - ఉపాధ్యాయులు - స్థానిక సంస్థలకు సంబంధించిన ఖాళీలు. ఈ ఆగస్టులో కృష్ణా పుష్కరాలు రానున్న నేప‌థ్యంలో అవి విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత సెప్టెంబర్‌ లో మంత్రివర్గ విస్తరణ జరిపేలా టీడీపీ అధిష్టానం నిర్ణ‌యించ‌న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఇలా అయిన ప‌క్షంలో ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముందని, దీనివలన ఎలాంటి పేచీలు తలెత్తవని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని చెప్తున్నారు.