Begin typing your search above and press return to search.
పార్టీ ఆఫీసులోనే మోసపోతున్న చంద్రబాబు
By: Tupaki Desk | 1 March 2016 12:29 PM GMTఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుకు రాష్ట్రాభివృద్దే లోకమని.. పార్టీయే ఇల్లని చెబుతుంటారు. సొంత ఇల్లులా చూసుకుంటున్న పార్టీ కార్యాలయంలోనే కొందరు చంద్రబాబును తెలివిగా మోసం చేస్తున్నారు. తమ అవినీతితో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అంటూ ప్రజాప్రతినిధుల వద్దే లంచాలు తీసుకుంటున్నారు. రాజకీయ నేతలు - ప్రజాప్రతినిధులే అవినీతి పరులు అనుకుంటే వారి దగ్గరే డబ్బులు కొట్టేస్తున్నారంటే వారు మామూలోళ్లు కారని ఈ సంగతి తెలిసినవారంతా అనుకుంటున్నారు. ఎంతమందికి ఈ కథలు తెలిసినా.. పార్టీ అధినేత చంద్రబాబు చెవి వరకు మాత్రం ఆ 'సమాచారం' వెళ్లడం లేదు.
టీడీపీ ఆఫీసులో డాటా రికార్డింగ్ - అనాల్సిస్ - నివేదికల తయారీ వంటివాటి కోసం ప్రత్యేక విభాగం ఒకటుంది. ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య లెక్కన మొత్తం 42 మంది ప్రధానం ఈ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పనిచేస్తున్నారు. వీరు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో పరిస్థితులు, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు వంటివి రికార్డు చేస్తుంటారు. పార్టీ కోరినప్పుడు ఆ డాటా - రిపోర్టులు ఇస్తుంటారు. నియోజకవర్గ సమాచారం కూడా పూర్తిస్థాయిలో వీరి వద్ద ఉంటుంది. ఈ సమాచారాన్ని అడ్డంపెట్టుకుని కొందరు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలకో, కీలక నేతలతో అనుకూలంగా నివేదికలు కావాలంటే వారి నుంచి డబ్బు తీసుకుని అనుకూల నివేదికలు ఇస్తున్నారు. ఒక్కోసారి పార్టీలోనే ఒకరిపై ఒకరు వ్యతిరేక రిపోర్టులు ఇప్పించుకోవడానికి కూడా వీరిని ఉపయోగించుకుంటుండడంతో ఆ పనినీ ఆమ్యామ్యాలతో చేస్తున్నారు. ఇక కొత్తగా టిక్కెట్ కోరుకుంటున్నవారో... పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నవారో వచ్చి తమ నియోజకవర్గ సమాచారం అడిగితే వీరి పంట పండినట్లే.ముందుగా వారిని గవర్నమెంటు ఆఫీసుల్లో అధికారుల మాదిరిగా రేపుమాపు అంటూ పదిసార్లు తిప్పుతున్నారు. చివరికి వారు వీరి సంగతి తెలుసుకుని కోరినంత ముట్టజెపితేనే కోరిన సమాచారం ఇస్తున్నారు.
ఇలా టీడీపీ ఆఫీసులో ఈ డాటా ప్యాక్ ల సేల్స్ జోరుగా సాగుతోంది. దీనివల్ల లంచాలు - అవినీతి మాట ఎలా ఉన్నా కూడా చంద్రబాబుకు వాస్తవ పరిస్థితులు తెలియకుండా మరుగున పడుతున్నాయి. ఏ నియోజకవర్గ పరిస్థితినైనా, నేత కు సంబంధించిన రిపోర్టును అడిగినా కూడా పూర్తిగా తప్పుడు నివేదికలే చంద్రబాబుకు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ తరఫున వచ్చిన నివేదికలే కావడంతో వాటిని నమ్ముతున్న చంద్రబాబు ఒక్కోసారి వాస్తవ పరిస్థితులు తెలుసుకోలేకపోతున్నారు. ఇది లాంగ్ రన్ లో నష్టం చేస్తుందని... చంద్రబాబుకు ఇప్పటికైనా పార్టీ ఆఫీసులో జరిగే తంతును మొత్తం చెప్పాలని కొందరు నిబద్ధత గల నేతలు అనుకుంటున్నారట.