Begin typing your search above and press return to search.

బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జేసీ ఎపిసోడ్‌

By:  Tupaki Desk   |   16 Jun 2017 8:12 AM GMT
బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జేసీ ఎపిసోడ్‌
X
ఒక‌రు త‌ప్పు చేస్తే.. మ‌రొక‌రికి షాక్ త‌గ‌లటం అరుదుగా మాత్ర‌మే జ‌రుగుతుంది. అందులోకి ఒక పార్టీ ఎంపీ చేసిన త‌ప్పున‌కు.. పార్టీ అధినేత ఇరుకున ప‌డ‌టం.. ఉక్కిరిబిక్కిరి కావ‌టం కాస్త భిన్న‌మైన విష‌య‌మే. తాజాగా అలాంటి ప‌రిస్థితిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో నానా హంగామా చేసి.. ఇండిగో సిబ్బందిపై గూండాగిరి చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీడీపీఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం బాబుకు పెద్ద స‌మ‌స్య‌గా మారిన‌ట్లుగా చెబుతున్నారు.

నిజానికి జేసీ ఎపిసోడ్‌ లో ఆయ‌న కాకుండా ఇంకెవ‌రున్నా ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని చెబుతున్నారు. తాజా ఉదంతంలో జేసీ ప్రిస్టేజ్ గా తీసుకోవ‌టం.. ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌టంతో.. ఆయ‌న్ను బుజ్జ‌గించ‌టం.. జ‌రిగిన దానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పించేందుకు బాబు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మొండిత‌నానికి మారు పేరైన జేసీ.. కొన్ని విష‌యాల్లో చాలా సీరియ‌స్ గా ఉంటార‌ని చెబుతారు.

తాజా ఎపిసోడ్‌ లో త‌న త‌ప్పు ఏమీ లేద‌ని జేసీ న‌మ్మ‌కంగా ఉన్నార‌ని.. అదే చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు ఈ ఉదంతం జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టం.. బాబుపై ఒత్తిడిని మ‌రింత పెంచిన‌ట్లుగా చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ సిబ్బందికి జేసీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌టం ద్వారా ఈ ఎపిసోడ్‌ ను క్లోజ్ చేసే వీలున్నా.. అందుకు జేసీ సుముఖంగా లేర‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మరో వైపు ఇష్యూను వీలైనంత సింఫుల్ గా తేల్చేసేందుకు.. సొంత పార్టీకి చెందిన కేంద్ర‌ విమాన‌యాన‌శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిని రాజు సాయం కోరుతున్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. జేసీ సంగ‌తేమో కానీ..బాబుకు తాజా ప‌రిణామాలు ఇబ్బందిక‌రంగా మారాయ‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/