Begin typing your search above and press return to search.
చంద్రబాబులో అసహనం ఆ రేంజిలో ఉందా?
By: Tupaki Desk | 18 Feb 2016 8:59 AM GMTఏపీ సీఎం చంద్రబాబు తన తీరు కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాల పట్ల ఆయన చూపుతున్న అసహనం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వారి పట్ల ఆయన చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు.. వారి పట్ల అనుసరిస్తున్న వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా రాజధాని తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల సందర్భంగా చంద్రబాబు, పోలీసుల తీరు వివాదాస్పదమైంది. సీఎం శంకుస్థాపనకు ముందుగానే పోలీసులు అరెస్టులకు తెరలేపారు. రాజధాని గ్రామాల్లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వాలని కోరుతూ వెలగపూడిలో సిఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వేచి ఉన్న యువజన సంఘం నాయకులను ఉదయాన్నే పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుల సందర్భంగా పోలీసులు - అభ్యర్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం ఏమిటని అభ్యర్థులు తుళ్ళూరు ఎస్ ఐ రవికుమార్ ను ప్రశ్నించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదలైన నాయకులు ఇతర అభ్యర్థులతో కలిసి.. తుళ్లూరులోని సిఆర్ డిఎ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల రాకపోకలను అడ్డుకున్నారు.. గుంటూరులో శుక్రవారం సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పుల్లారావు ఫోన్ లో హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. అంతకు ముందు సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు జె.నవీన్ ప్రకాష్ ను పోలీసులు బుధవారం తెల్లవారుజామునే అరెస్టు చేసి పోలీస్టేషన్ లో నిర్బంధించారు. ఇవన్నీ చంద్రబాబు, మంత్రుల సూచనలతోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ఇంతకుముందు పలుమార్లు ఇదే తీరు ప్రదర్శించారు. జర్నలిస్టు సంఘాల నేతలనూ ఆయన దారుణమైన మాటలు అంటున్నారు. గతంలో ఓ సభ సందర్భంగా చంద్రబాబును కలిసి జర్నలిస్టుల ఆరోగ్య కార్డులపై వినతిపత్రం ఇచ్చేందుకు జర్నలిస్టు సంఘాల రాష్ట్రస్థాయి నాయకులు వేదిక పక్కన కామ్ గా నిల్చున్నారు. వారిని చూసిన చంద్రబాబు మీరు ఇక్కడెందుకున్నారు... వెళ్లండి.. వెళ్లండి... ఐఎస్ ఉగ్రవాదుల కంటే మీరు ప్రమాదకరమైనవారు అంటూ అవమానించారు. చెబుతుంటే మీకు వినిపించదా... ఇంకోసారి నా దగ్గరకు రావొద్దు అంటూ అవమానించారు. ఆ విషయంపై జర్నలిస్టులు ఆందోళన చేయడంతో అప్పుడు వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు.
యువత - విద్యార్థులు - జర్నలిస్టులంటే తీవ్ర వ్యతిరేకత చూపుతున్న చంద్రబాబు వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటుంటే చంద్రబాబు మాత్రం వారిని టెర్రరిస్టులని అవమానిస్తూ దూరం చేసుకుంటున్నారు. యువత, విద్యార్థులను కూడా అరెస్టులు, నిర్బంధంతో దూరం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబుకే కాదు టీడీపీకి.... ఆ పార్టీ భవిష్యత్ నేత లోకేశ్ కు కూడా నష్టం కలిగించే ప్రమాదం ఉంది.