Begin typing your search above and press return to search.
బాబు మాటః కాపు నేతలే రిజర్వేషన్ వద్దన్నారు!
By: Tupaki Desk | 31 Jan 2016 7:42 PM GMTతూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన హింసాత్మకంగా మారి తుని రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు విశాఖపట్నం - విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు.
బీసీ జాబితాలో కాపులను చేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే వెంటనే చేర్చి ఇటు బీసీలకు, అటు కాపులకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటంలో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. తొందరపడి కాపులను బీసీలలో చేరుస్తూ జీవో ఇవ్వవద్దని కాపు నేతలే తనను కోరారని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని అంశాలూ పరిగణనలోనికి తీసుకుని, న్యాయపరమైన సమస్యలు ఏవీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కాపు నేతలు చెప్పారని...ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకోకుండా జీవో జారీ చేస్తే నష్టం ఎవరికి అన్నది అర్ధం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.
ఇదిలాఉండగా తునిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో విజయవాడలోని ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మరోవైపు రైల్వే ఆస్తులకు రక్షణ కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ఏపీ డీజీపీ జేవీరాముడుని కోరారు. తుని సంఘటన నేపథ్యంలో ఆయన సికిందరాబాద్ లోని రైల్ నిలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం- విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విజయవాడ- రాజమండ్రి-విశాఖపట్నం మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఇటు ఏపీ డీజీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎస్ తో రైల్వే జీఎం రవీంద్రగుప్త స్వయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.