Begin typing your search above and press return to search.
బాబు మార్కు పోటు!..నాడు హరికృష్ణకు - నేడు శ్రావణ్ కు!
By: Tupaki Desk | 10 May 2019 1:30 AM GMTటీడీపీ అధినేత, ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసే రాజకీయాలు చాలా ప్రత్యేకమనే చెప్పాలి. తనకు ఇష్టమైన వారిని అప్పటికప్పుడే అందలం ఎక్కించే చంద్రబాబు.... వారిని తనతో పాటే ఎదిగేలా చేస్తారు. అదే సమయంలో తనకు ఇష్టం లేకపోయినా అందలం ఎక్కించాల్సి వస్తే మాత్రం తనదైన మార్కు రాజకీయంతో నిర్ణీత వ్యవధిలోనే పోటు పడేలా చేస్తారు. చంద్రబాబులోని ఈ తరహా నేర్పు... ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేస్తోంది. ఎందుకంటే... వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావును తన పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు... గిరిజనుల్లో, ప్రత్యేకించి వైసీపీకి పట్టున్న విశాఖ మన్యంలో మంచి మైలేజీని సంపాదించాలని యత్నించిన మాట తెలిసిందే కదా. ఈ క్రమంలో కిడారి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ....మావోయిస్టులు ఆయనను పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత కిడారి కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ ప్రకటించిన చంద్రబాబు... కిడారి కుమారుడు శ్రావణ్ ను ఏకంగా తన కేబినెట్ లో మంత్రిగా చేర్చుకున్నారు.
అయితే చట్టసభల్లో సభ్యుడిగా లేని నేత ఆరు నెలల వరకే మంత్రిగా కొనసాగే వీలుంది. ఆరు నెలల్లోగా సదరు మంత్రి ఏదేనీ చట్టసభకు ఎన్నికవ్వాలి. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు విస్మరించారని, వెరసి తనకు అంతగా ఇష్టం లేని శ్రావణ్ ను చంద్రబాబు చట్టం పేరు చెప్పి తప్పించేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఈ తరహా విశ్లేషణలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయన్న విషయానికి వస్తే... గతంలో చంద్రబాబు సొంత బావ, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు కూడా చంద్రబాబు ఇదే తరహాలో ఎగ్జిట్ ఇచ్చారు. నాటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న జనం... నాడు హరికృష్ణను తప్పించిన మాదిరిగానే ఇప్పుడు శ్రావణ్ ను కూడా చంద్రబాబు తప్పించేశారని చెప్పుకుంటున్నారు.
అయినా నాడు హరికృష్ణకు ఎలాంటి పరాభవం జరిగిందన్న విషయానికి వస్తే... 1995లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన పార్టీతో పాటు ఆయన చేతుల కష్టం మీద దక్కిన అధికారాన్ని కూడా చంద్రబాబు లాగేసుకున్నారు కదా. ఎన్టీఆర్ కుమారుడు అయినప్పటికీ హరికృష్ణ తదితరులు బాబు వెంటే నడిచారు. ఈ క్రమంలో వారిని సంతృప్తిపరిచేందుకు హరికృష్ణను తన కేబినెట్ లో చేర్చుకున్న చంద్రబాబు... రవాణా శాఖను ఆయనకు అప్పగించారు. అయితే అప్పటికి హరికృష్ణ చట్టసభలో సభ్యులు కాదు. ఆరు నెలల్లోగా ఎలాగోలా చట్టసభలోకి ఎంట్రీ ఇప్పించేస్తానని చెప్పిన చంద్రబాబు.. వ్యూహాత్మకంగానే ఆ విషయాన్ని మరిచారు.
అయితే చంద్రబాబు మరిచారని కాల ఆగదు కదా. గిర్రున ఆరు నెలలు తిరిగిపోయింది. అప్పటికీ హరికృష్ణకు చట్టసభలోకి ఎంట్రీ దక్కలేదు. దీంతో చట్టం పేరు చెప్పి హరికృష్ణ చేత రాజీనామా చేయించేశారు. దీంతోనే హరికృష్ణ... చంద్రబాబు అంటే రుసరుసలాడేవారు. ఆ తర్వాత చాలా కాలానికి హరికృష్ణకు రాజ్యసభ సీటిచ్చిన చంద్రబాబు అలా నెట్టుకొచ్చేశారు. తాజాగా ఇప్పుడు హరికృష్ణ మాదిరే కిడారి శ్రావణ్ కూడా ఇప్పుడు చంద్రబాబు వ్యూహం కారణంగానే తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.