Begin typing your search above and press return to search.
ఇంత బండచాకిరీ బాబు మాత్రమే చేస్తారా?
By: Tupaki Desk | 16 Aug 2016 1:36 PM GMTకొన్ని పనుల్ని కొంతమంది చాలా సింఫుల్ గా పూర్తి చేస్తారు. అలాంటి పనినే మరికొందరు ఎంతో కష్టంగా చేస్తారు. సింఫుల్ గా పని పూర్తి చేసే వారికి.. బండచాకిరి చేసి కష్టపడే వారికి ఒకేలాంటి ఫలితం వచ్చినప్పుడే ఇద్దరిలో ఎవరు తెలివైనోళ్లన్న ప్రశ్న తెర మీదకు వస్తుంది. తాజాగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న కష్టం చూస్తే ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి.. పుష్కర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? భక్తులకు ఎలాంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవటానికి పుష్కర ఘాట్లకు వెళ్లి.. అక్కడి యాత్రికుల్ని స్వయంగా తెలుసుకోవటం లాంటివి చూసినప్పుడు.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ కోరుతున్న తీరు చూసినప్పుడు.. ఒక సీఎం ఇంతగా కష్టపడలా? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు.
దీనికి పూర్తి రివర్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు కదపకుండా.. పనులన్నీ పూర్తి చేసిన వైనం కనిపిస్తుంది. గోదారి పుష్కరాల సమయంలోనూ.. తాజా కృష్ణా పుష్కరాల విషయంలోనూ కేసీఆర్ ఘాట్ల దగ్గర అస్సలు కనిపించరు. జరగాల్సిన ఏర్పాట్లు అన్నింటిని ఆయన పైన ఉండే పురమాయించటం కనిపిస్తుంది.
గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు భారీగా కష్టపడ్డారు. నాడు ఆయన అంతలా రియాక్ట్ కావటానికి సముచితమైన కారణం ఉంది. గోదావరి పుష్కరాల మొదటి రోజు తొక్కిసలాటలో భారీగా యాత్రికులు మృతి చెందిన నేపథ్యంలో ఆ మరకను తుడిచేసేందుకు ఆయన అంతలా శ్రమించాల్సి వచ్చింది. తన ప్రభుత్వంలో జరిగిన భారీ తప్పునకు మూల్యం చెల్లించాలన్నట్లుగా ఆయన పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా ఘాట్ల వెంట పరుగులు తీశారనే చెప్పాలి.
ఆ రోజు చేసిన పనే ఈ రోజూ చేయాలా? అన్నదే ప్రశ్న. ఇవాల్టికి ఇవాళ.. పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లి.. అక్కడి ప్రయాణికుల్ని ఆయన ఏర్పాట్ల గురించి అడిగారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు బాబుతో మాట్లాడుతూ.. తాము స్నానాలు చేశాక.. బట్టలు మార్చుకోవటానికి తగిన వసతి లేదని.. ఆ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడే అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. పుష్కర స్నానం తర్వాత మహిళలు బట్టలు మార్చుకునేందుకు వసతి వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఆ విషయం పుష్కరాలు స్టార్ట్ అయిన ఐదో రోజున తెలియాల్సి రావటమే దురదృష్టకరం. అంటే.. ఇక్కడ బాబు ఎంత కష్టపడినా.. అందుకు తగ్గట్లుగా అధికారుల పని తీరు లేదన్నది స్పష్టమవుతంది. అదే సమయంలో.. ఏర్పాట్లు ఎలా జరిగాయన్న విషయంలో సునిశితంగా బాబు దృష్టి లేదన్న విషయం అర్థమవుతుంది.
పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి తరచూ ఘాట్ల చుట్టూ తిరగటం వల్ల అధికారుల ఓవరాక్షన్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల యాత్రికులకు కష్టమే కానీ.. ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. స్వయంగా రాజే క్షేత్రంలోకి దిగటం ఏమిటి? బాబు పరివారం మొత్తం ఏం చేస్తున్నట్లు? కాలు కదపకుండానే అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నట్లుగా చేయాల్సిన చంద్రబాబు.. ఇలా ఘాట్ల చుట్టూ తిరిగి ఫీడ్ బ్యాక్ తెలుసుకొని.. ఏర్పాట్లు చేయిస్తానని మాట ఇవ్వటాన్ని చూస్తే.. మరీ ఇంత బండ చాకిరీ అవసరమా బాబు అన్న భావన కలగటం ఖాయం. మీరేమంటారు?