Begin typing your search above and press return to search.

శంకుస్థాప‌న‌కు మోడీ వ‌ద్దంట‌

By:  Tupaki Desk   |   22 May 2015 6:10 PM GMT
శంకుస్థాప‌న‌కు మోడీ వ‌ద్దంట‌
X
ఏపీ రాజ‌ధాని శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని ఏపీ స‌ర్కారు భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీని ఆహ్వానించ‌టం ద్వారా.. ఈ కార్య‌క్ర‌మానికి మ‌రింత శోభ తేవ‌చ్చ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. ఊహించ‌ని విధంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోటి నుంచి వ‌చ్చిన ఒక వ్యాఖ్య.. ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు చిన్నపాటి షాక్ ను ఇచ్చింది.

శుక్ర‌వారం నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఏపీ రాజ‌ధాని శంకుస్థాప‌న వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది ఈ సంద‌ర్భంగా.. జూన్ ఆరో తేదీన నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీని ఆహ్వానించాలంటూ ప‌లువురు మంత్రులు సూచించారు.

ఈ ప్ర‌తిపాద‌న‌కు ఊహించ‌ని విధంగా బాబు స్పందించారు. రాజ‌ధాని శంకుస్థాప‌న‌కు మోడీ అక్క‌ర్లేద‌ని.. రాజ‌ధాని ప‌నులు ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధానిని పిలుద్దామంటూ బాబు వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏపీ రాష్ట్ర రాజ‌ధాని శంకుస్థాప‌న అంటే చ‌రిత్ర‌లో నిలిచిపోయే అంశం. అలాంటి కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీని ఆహ్వానించ‌కుండా బాబు నిర్ణ‌యం తీసుకోవ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. ఇలాంటి నిర్ణ‌యాలు మోడీ ఈగోను హ‌ర్ట్ చేస్తే.. అందాల్సిన సాయం మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?