Begin typing your search above and press return to search.
గందరగోళంలో బాబుకు వచ్చిన భలే ఐడియా ఇది
By: Tupaki Desk | 19 Oct 2018 6:06 PM GMTబాబు గారికి, ప్రచారానికి మధ్య ఉన్న దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనేది రాజకీయవర్గాల్లో ఉన్న మాట. సందర్భం ఏదైనా దాన్ని ఓన్ చేసుకోవడం...తనదైన శైలిలో దాన్ని తన ఘనతగా ప్రాచం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని టాక్ ఉంది. అలాంటి బాబు ఇప్పుడు తాజాగా హోరుగా సాగుతున్న ప్రచారాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు చూశారని అంటున్నారు. అయితే, ఇది కాస్త నాన్ సింక్ అయిందనేది చాలా మంది మాట.
వివరాల్లోకి వెళితే...ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాకుండా...తెలుగు రాష్ట్రాల్లో `మీటూ`పెద్ద ఎత్తున జరుగుతున్నసంగతి తెలిసిందే. తమపై జరిగిన లైంగిక దాడి, అవాంచిత చర్యలకు పాల్పడిన వారి గురించి ప్రముఖుల నుంచి మొదలుకొని వివిధ వర్గాల వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీన్ని బాబుగారు కైవసం చేసుకోవాలని చూశారు. దాన్ని తనను తీవ్రంగా ఇరకాటంలో పడేస్తున్న ప్రత్యేక హోదా విషయంలో వాడుకున్నారు. మీటూ స్ఫూర్తితో హోదా కోసం పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే, ఏమిటీ ఎలా అనే క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల బీజేపీ బంధంలో హోదా అవసరమే లేదనే మాట కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షాలను కూడా ఎద్దేవా చేశారు. అయితే, తనపట్ల ప్రత్యేక హోదా కేంద్రంగా వ్యతిరేకత పెరుగుతుందని గమనించిన బాబు...అనంతరం ప్లేట్ ఫిరాయించారు. హోదా గళం ఎత్తారు. అయితే, దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఆయన చిత్తశుద్ధి లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా అర్థం పర్థం లేని పోలికలు పెడుతున్నారని పలువురు సణుక్కుంటున్నారు.