Begin typing your search above and press return to search.
బాబు తొందరపడ్డారా? ముద్రగడ మొండికేస్తున్నారా?
By: Tupaki Desk | 9 Jun 2016 9:30 AM GMT కాపు ఉద్యమంతో తనకు సమస్యలు సృష్టిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు తొందరపడ్డారా.. ? తుని విధ్వంసానికి పాల్పడ్డారంటూ కొందరిని అరెస్టు చేసి తప్పటడుగు వేశారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. అనవసరంగా కాపుల పంచాయతీని తెగే దాకా లాగుతూ చంద్రబాబు సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. ముద్రగడ గానీ, కాపు నేతలను గానీ ఇప్పుడు అరెస్టు చేయాలని అనుకోవడం తొందరపాటు చర్యని... అరెస్టుల విషయంలో ఆయన తొందరపడి ఉండకపోతే ముద్రగడ మళ్లీ హడావుడి చేసేవారు కాదన్న వాదన వినిపిస్తోంది. అదేసమయంలో చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే కాపుల విషయంలో మంచి పనులు చేస్తున్నా ముద్రగడ మొండివాదనలో ముందుకెళ్తున్నారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
తుని సంఘటనలో విధ్వంసానికి దిగిన వారిని అరెస్టు చేసే కార్యక్రమం పోలీసులు చేపట్టడం.. ఆ అరెస్టులు ఆపాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తన ఇంట్లో నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ ఇప్పుడు తనను అరెస్టు చేయడానికి వస్తే పురుగు మందు తాగుతానంటూ పోలీసులను కనీసం దగ్గరకు రానివ్వడంలేదు. ఈ క్రమంలో చంద్రబాబులోనూ టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. అయితే... కుల ఉద్యమం కావడంతో ఎక్కడ ముదురుతుందో అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ముందుగానే ముద్రగడను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ముద్రగడ ఆ అరెస్టులను అడ్డంపెట్టుకుని మరోసారి ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ముద్రగడ విషయంలో పట్టించుకోనట్లుగానే ఉంటే మంచిదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇంతకుముందు కాపు గర్జన సమయంలోనూ కొంత మెత్తగా ఉండడంతోనే విధ్వంసం జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది.
నిజానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో కాపుల కోసం చంద్రబాబు సంక్షేమ పథకాలు చేపట్టారు. కానీ... అదేమీ పట్టించుకోకుండా చంద్రబాబుపై ముద్రగడ దండెత్తుతున్నారు. దీంతో తాను ఇంత చేస్తున్నా తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోంది. దానివల్ల కూడా ఆయన ముద్రగడ తీరును పదేపదే తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి, ముద్రగడకు మధ్య సంధానకర్తగా ఎవరైనా తటస్థ వ్యక్తులు వ్యవహరించి వాస్తవాలు మాట్లాడగలిగితే చంద్రబాబు ప్రభుత్వానికి, కాపులకు కూడా మేలు జరుగుతుంది. లేదంటే.. పంతాలకు, పట్టింపులకు వెళ్తే ఇరువర్గాలకు నష్టమే జరుగుతుంది.