Begin typing your search above and press return to search.
‘‘పాదయాత్రకు చెక్’’.. ఫ్యూచర్లో బాబుకూ కష్టమే
By: Tupaki Desk | 16 Nov 2016 3:51 AM GMTప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల్ని రాజకీయ పార్టీలు.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలు తప్పుపట్టొచ్చు. కానీ.. ప్రజలు మాత్రం వాటికి తమ ఆమోద ముద్ర వేస్తారు. నేతల రాజకీయ స్వార్థానికి ప్రభుత్వం చక్కటి చెక్ చెప్పిందని భావిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పదేళ్లు విపక్ష నేతగా ఉన్న ఆయన.. నాటి ప్రభుత్వాల మీదా.. ప్రభుత్వ విధానాలపై పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఎన్నో యాత్రలు.. కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మర్చిపోలేం.
బస్సుయాత్రలు మొదలుకొని పాదయాత్రల్ని చేపట్టిన చంద్రబాబు తన వాణిని వినిపించేందుకు ఎంతగానో శ్రమించారు. చివరకు ఆయన కోరుకున్నట్లే మరోసారి అధికారానికి చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. పవర్ లో లేనప్పుడు తాను ఏదైతే చేశానో.. పవర్ లోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించటం సామాన్య ప్రజానీకానికీ రుచించదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఈ రోజు ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపేశారు. రేపొద్దున ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే.. దాన్ని కూడా అనుమతి కావాలని అడ్డుకుంటారా? శాంతిభద్రతల సమస్య అంటూ పోలీసులతో నిలిపివేయిస్తారా? ఒకవేళ అలాంటి పనే చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును ప్రజానీకం ఏ మాత్రం సమర్థించరు. ఒకవేళ జగన్ చేసే పాదయాత్రకు ఓకే చెబితే.. కాపుల్లో ఇది మరింత అసంతృప్తిని రేకెత్తించటం ఖాయం. తమ హక్కుల కోసం తమ ఉద్యమ నేత పాదయాత్ర చేస్తానంటూ అడ్డుపడే ప్రభుత్వం.. జగన్ పాదయాత్రకు అలాంటి ఆంక్షలు ఏమీ లేకపోవటం కాపుల పట్ల ఏపీ సర్కారుకున్న చిన్నచూపుగా ప్రచారం జరిగితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది చంద్రబాబేనన్న విషయాన్నిమర్చిపోకూడదు.
పాదయాత్రల కారణంగా భావోద్వేగాలు మరింత పెరుగతాయన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండి ఉంటే.. ముద్రగడ పాదయాత్ర చేసే అవకాశాన్నే కల్పించకూడదు. కానీ.. అలాంటిదేమీ చేయకుండా పాదయాత్రల్ని అడ్డుకోవటం ద్వారా జనాగ్రహాన్ని.. ప్రజల్లో ఉండే అసంతృప్తిని నిలువరించామని అనుకుంటే పొరపాటు పడినట్లే. పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన చంద్రబాబుకు జనాల మైండ్ సెట్ తెలీకుండా ఏమీ ఉండదు. కాకుంటే.. ‘పవర్’ పొర ఆయన కళ్లకు కమ్మేసి ఉంటే జనాగ్రహానికి కలిగించే నిర్ణయాలు ఒకటి తర్వాత ఒకటి తీసుకునే వీలుంటుందని చెప్పక తప్పదు. తొందరపాటు.. దూరం ఆలోచింకపోవటం.. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయంపై బాబు కసరత్తు చేయలేదన్నట్లుగా ఉంది. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవటం ద్వారా భవిష్యత్తులో తాను విపక్ష నేతగా పోరాడాల్సి వస్తే.. తాను పవర్ లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని చూపిస్తూ పరిమితులు విధిస్తే ఆయనేం చేయగలరు. అధికారంతో అన్ని సాధిస్తామన్న భ్రమ నుంచి బాబు బయటకు వస్తే బాగుంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/