Begin typing your search above and press return to search.
ప్రవాసాంధ్రుల సత్తాకు బాబు విత్తే కారణమట!
By: Tupaki Desk | 15 Oct 2017 5:30 PM GMTవినే వాడు ఉండాలే గానీ... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నైనా చెబుతారు. ఎంతసేపైనా అలుపన్నదే లేకుండా చెబుతారు. ఎన్ని విషయాలైనా చిరాకే లేకుండా వల్లే వేస్తారు. ఇదేదో ఇప్పుడిప్పుడే ఆయనలో మనకు కనిపిస్తున్న నైజమేమీ కాకున్నా... ఉమ్మడి తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత... కేసీఆర్ దెబ్బకు ఉన్నపళంగా హైదరాబాదును వీడి విజయవాడలో కాలుమోపిన తర్వాత ఈ తరహా వైఖరి చంద్రబాబులో బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. హైదరాబాదును ఐటీకి కేంద్రంగా తయారు చేసింది తానేనని, అసలు హైదరాబాదు ఇప్పుడిలా ఉందంటే... దానికి కారణం తానేనని కూడా చంద్రబాబు డబ్బాలు కొట్టుకున్న వైనం మనకు కొత్తేమీ కాదు.
ఇలా అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు తనదైన గొప్పతనాన్ని వేరెవరో చెప్పడం ఎందుకు? తానే చెప్పుకుంటే పోతుంది కదా అన్న రీతిలో ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం విజయవాడ కేంద్రంగా ఏపీ సర్కారు పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రకటించిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నాలెడ్జ్ ఎకానమీ ప్రాధాన్యాన్ని వివరించే క్రమంలో తన సొంత డబ్బా కొట్టుకున్న చంద్రబాబు... ప్రస్తుతం విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణుల్లో 25 శాతం తెలుగోళ్లే ఉన్నారంటే... ఆ ఘనత తనదేనని కూడా జబ్బలు చరుచుకున్నారు. నాడు తాను తీసుకున్న ఓ కీలక నిర్ణయం కారణంగానే ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలలకూ తెలుగు ఐటీ నిపుణులు విస్తరించగలిగారని కూడా ఆయన చెప్పుకున్నారు.
అయినా ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... *నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆరోజు ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్క కిలోమీటర్ దూరంలో ఎలిమెంటరీ స్కూల్ , మూడు కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ , ఐదు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, అదే విధంగా రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రయత్నం చేశాను. కాలేజీలు పెడితే లాభం లేదు, అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలను ప్రమోట్ చేశాను. ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన తర్వాత మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారు. ప్రపంచంలో 25 శాతం ఐటీ ఇంజనీర్లు మన వాళ్లు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజున నేను వేసిన విత్తనమే. అదే సమయంలో మరోటి ఆలోచించాను, ఉద్యోగాలతో తృప్తిపడకుండా..పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆరోజున ఓ మెస్సేజ్ ఇచ్చా* అని చంద్రబాబు తనదైన స్టైల్లో సెల్ఫ్ డబ్బా కొట్టేసుకున్నారు.
ఇక పనిలో పనిగా విద్యార్థులు దేనికి ప్రాధాన్యమివ్వాలన్న విషయంలోకి దూరిపోయిన చంద్రబాబు... సంస్కారం అనే కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంపై చంద్రబాబు ఏమన్నారంటే... *నేను ఒకటే నమ్ముతాను. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం లేదు..ఇరవై సంవత్సరాలుగా చెబుతున్నాను. మన పిల్లలకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు. మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తాం అనేది ముఖ్యం. చదువు.. తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది. అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున మనం ఆనందంగా ఉండాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మన సంప్రదాయాలని, మన కుటుంబ వ్యవస్థను, అదే మాదిరిగా మనకున్న విలువలను మనం కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారు* అని తనదైన స్టైల్లో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.