Begin typing your search above and press return to search.
బాబు మారలేదు..ఆయన మాట మారలేదు
By: Tupaki Desk | 28 March 2017 7:11 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం - సమైక్యాంధ్రప్రదేశ్ పోరాటం జోరుగా సాగుతున్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక మాట గుర్తుండే ఉంటుంది. ఏపీ - తెలంగాణ నాకు రెండు కళ్ల వంటివి అని ఓ విలేకరుల సమావేశంలో బాబు చెప్పారు. అయితే దానికి రకరకాల వ్యంగ్య భాష్యాలు తోడై రెండు కళ్ల సిద్ధాంతం అనే పేరు వచ్చేసింది. చంద్రబాబు తనకు రెండు రాష్ర్టాలు ముఖ్యమే అని చెప్పినప్పటికీ ప్రచారం మాత్రం వేరే విధంగా జరిగింది. ఇక తాజా విషయానికి వస్తే... మరోమారు చంద్రబాబు తనకున్న రెండు ప్రాధాన్య అంశాలను వివరిస్తూ రెండు కళ్ల వంటి అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ రెండు అంశాలేంటి అంటే ఒకటి రాజధాని అమరావతి నిర్మాణం, మరొకటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.
పోలవరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలకు - ఎమ్మెల్సీలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం - అమరావతి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను మార్చివేసే ఈ రెండు కీలక నిర్మాణాలు తనకు రెండు కళ్ల వంటివని చెప్పారు. చైనా త్రీగోర్జెస్ ప్రాజెక్టుకు పోలవరం ఏ మాత్రం తీసిపోదని బాబు చెప్పారు. హంద్రీ-నీవా - గాలేరు-నగరి - తెలుగు గంగ ఇలా రాయలసీమలో ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసేందుకు పోలవరం ప్రాజెక్టుతో సాధ్యమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఇలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 40 టీఎంసీల నీటిని రిజర్వాయరులో భద్రపరిచి, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తరలిస్తామన్నారు. అమరావతికి ఎగువన 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మాణానికి యోచిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నగర భవిష్యత్ నీటి అవసరాలను ఈ నిర్మాణంతో తీర్చాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా ఆర్థిక సహకారం అందుతోందని, ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పారు. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుకుండా రాష్ట్రానికి ఉపకరించేలా చేయాలన్నదే తన సంకల్పంగా చెప్పారు. భూసేకరణకు పెద్ద మొత్తంలో పరిహారం అందిస్తున్నామని దీంతో అంచనా వ్యయం పెరిగిందని అన్నారు. అటు అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని, స్పిల్ వే-స్పిల్ ఛానల్ తదితర నిర్మాణాల వివరా లను సభ్యులకు ఆసక్తి కలిగిలా అధికారులు తెలియజేశారు.
మరోవైపు పోలవరం సత్వరం పూర్తి అయ్యేలా దేవుణ్ణి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రోజూ ఒక నిమిషం అయినా ప్రార్థించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసే శక్తి సామర్థ్యాలు పోల వరం ప్రాజెక్టుకు ఉన్నాయని, ఏడాదిపాటు వర్షాలు లేకున్నా, తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా నీటి సమస్య తలెత్తే అవకాశమే లేదని అన్నారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని 2018కల్లా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరందించి తీరుతామని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు లేనంతగా అత్యంత పొడవైన అప్రోచ్ చానల్, అత్యంత ఎత్తయిన గేట్ల ఏర్పాటు, అత్యంత లోతు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు ఘనతలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వివిధ దశలుగా జరుగుతున్న పనులను చీఫ్ ఇంజనీర్ రమేష్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ఆకృతుల ఆమోదం దగ్గర నుంచి నాణ్యత పరిశీలన వంటివి సెంట్రల్ బోర్డు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని, నిర్మాణంలో ఎక్కడా రాజీపడడం లేదని ఉభయ సభల సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/