Begin typing your search above and press return to search.
పోల'రణం' మోసం వెనుక బాబు వ్యూహం...?
By: Tupaki Desk | 15 Dec 2017 6:28 AM GMTపోలవరం ప్రాజెక్టు విషయంలో తన వైఫల్యాన్ని - కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం - ధగాలను ప్రజల దృష్టికి రాకుండా సమస్యను పక్కదారి పట్టించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయం సాధించారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు - తద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఊహించని నష్టం వాటిల్లుతోంది. ఒకటి - రెండు కోట్లు కాదు ఏకంగా 42వేల కోట్ల రూపాయలు ప్రజలనెత్తిన భారం పడే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం - బీజేపీ ఎందుకు ఇలా మోసం చేస్తోంది? అందుకు తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులతో రాష్ట్రానికి మోసం - ద్రోహం చేస్తున్నాయి. ప్రజలకు ఈ విషయాలు తెలియకుండా ఎందుకు చంద్రబాబు అడ్డం పడుతున్నారు.? ఇంత నష్టం - మోసం జరుగుతున్నా ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం సమస్య ఒకటైతే చికిత్స మరో విధంగా అన్నట్లు మొత్తం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం లేదా? మొత్తం వ్యయాన్ని తాము భరించలేమని కేంద్రం ఏడాది క్రితమే స్పష్టం చేసినా ఆ విషయాన్ని సీఎం ఎందుకు దాచిపెట్టారు?
పోలవరం అనగానే ట్రాన్స్ ట్రాయ్ - పని వివాదం సకలంలో పనులు పూర్తి చేయలేకపోవటం - ఆ సంస్థ నుంచి కొంత పనిని తొలగించి వేరొకరికి అప్పగించేందుకు టెండర్ పిలవటం - దానిని కేంద్రం అడ్డుకోవటం లాంటివే ప్రధానమైన అంశాలుగా చంద్రబాబు ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అదే సమయంలో డయాఫ్రం వాల్ ఎత్తుకు సంబంధించి - సవరించిన అంచనాలపై కేంద్రం వ్యక్తం చేస్తున్న అనుమానాలు - సందేహాలపై మాత్రమే సీఎం స్పందిస్తున్నారు. తద్వారా అసలు సమస్యపై చర్చ జరగకుండా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాకుండా - తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని దాచిపెడుతున్నారు.
నిజానికి పైన పేర్కొన్న అంశాలేవీ ప్రాముఖ్యమైనవి కావు. అవి సమస్యలే అయినప్పటికీ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా విభజన సమయంలో పార్లమెంటులో స్పష్టమైన హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించినప్పటికీ దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటామని స్పష్టంగా లేఖ రాసినప్పటికీ ఆ సమస్య బయటికి రాకుండా అంత తీవ్రమైన అంశం ప్రజలకు దృష్టికి వెళ్లకుండా చంద్రబాబు తన వ్యూహాత్మక మాయాజాలం చేస్తున్నారు. మొత్తం తన కనుసన్నల్లో ఉండే మీడియా సహకారం ఆయనకు తోడ్పడుతోంది.
నిజానికి పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా మిగిలిన రూ.42 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన భారం పడే విధంగా చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన లేఖను 2016 నవంబర్ 30వ తేదీన రాసింది. ఏడాది గడిచిపోయినప్పటికీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ చెప్పనే లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో నీటిపారుదల రంగానికి సంబంధించిన పనులకు మాత్రమే కేంద్రం నిధులు సమకూరుస్తుందని మిగిలిన వ్యయాలకు కేంద్రం నిధులు ఇవ్వబోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్లాన్ ఫైనాన్స్ విభాగం స్పష్టంగా తమ లేఖలో పేర్కొంది.
కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయం పూర్తిగా పార్లమెంటు నిర్ణయానికి - చట్టానికి విరుద్ధమైంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత అందుకు అయ్యే వ్యయం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అది జరిగితే సకాలంలో పూర్తి కావటంతో పాటు రాష్ట్రానికి ఆర్థికభారం తప్పుతుంది. కానీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో మాటతప్పిన విధంగానే పోలవరం నిర్మాణంలోనూ దగా చేస్తుంటే ఆ విషయాన్ని పారదర్శకంగా ప్రజలముందుంచి అన్ని పక్షాల సహకారంతోనూ కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో సహజంగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి - శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తరువాత కేంద్రం నుంచి పూర్తి సాయాన్ని ఏవిధంగా రాబట్టాలనే దానిపై రాజకీయాలకు అతీతంగా చట్ట - న్యాయ పరిధిలో వ్యవహరిస్తుంటారు.
కానీ చంద్రబాబునాయుడు పోలవరం పూర్తి చేయటం నా జీవిత ధ్యేయం. రెండు కళ్లలో ఒకటి నాకు పోలవరం లాంటిది అని పదే పదే సందర్భం దొరికినప్పుడల్లా చెబుతుండే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని - బీజేపీ రాజకీయాన్ని బయటపడకుండా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా బీజేపీ - టీడీపీలు పోలవరంలోని ప్రధాన వైఫల్యాలు - లోపాలు బయట పడకుండా ఇతర అంశాలను తెరమీదకు తెచ్చారు.
రూ.58 వేల కోట్లు వ్యయం అవుతుందని చెబుతున్న చంద్రబాబు అందులో కేవలం రూ.1300 కోట్ల విలువైన పనులు మాత్రమే సమస్యగా ఎందుకు కనిపిస్తోంది? ఆ కొంత మొత్తం పూర్తయితే ప్రాజెక్టు పూర్తయినట్లు కాదు కదా? అదే విధంగా డయాఫ్రం ఎత్తు విషయంలో ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? దానిని పూర్తి చేయటం ద్వారా నీటిని కుడి - ఎడమల కాలువల ద్వారా మళ్లించి ప్రాజెక్టును పూర్తి చేశామన్నట్లు ప్రారంభించాలనే ఆతృతతో ఉన్నారా? నిజానికి డయాఫ్రం వాల్ అనేది ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతంలోకి నీరు వచ్చి ముంపు ఏర్పడకుండా పక్కకు మళ్లించేందుకు తాత్కాలిక నిర్మాణం మాత్రమే. సాధారణంగా ప్రతి ప్రాజెక్టులోనూ దీనిని చేపడతారు. కానీ తొలుత చంద్రబాబునాయుడు 2018లోనే నీరిస్తామని ప్రకటించటం వెనుక ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం ద్వారానే అది సాధ్యం చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి దీని నిర్మాణం ద్వారా ఆయకట్టుకు నీరివ్వటం సాధ్యంకాదు. అయినప్పటికీ తానే పోలవరం ప్రారంభించాలని భవిష్యత్తులో అధికారంలో ఉంటామో లేదో లేకపోతే ప్రారంభించే ఘనత తనకు దక్కకుండా పోతుందని ఆయన డయాఫ్రం వాల్ తెరమీదకు తెచ్చారు. నిజానికి ఇవేవీ తీవ్రమైన అంశాలు కాదు.
ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైనది నిధుల సమీకరణ. ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. పునర్విభజన చట్టం సెక్షన్ 90లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం 90 శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని ప్రకటించింది. 2014 ఫిబ్రవరిలో రాజ్యసభలోనూ - ఆతరువాత మార్చి 1న లోక్ సభలోనూ విభజన చట్టం రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి విభజన చట్టంలోని 90 సెక్షన్ లోని 1 - 2 - 3 - 4 అంశాల భారం మొత్తం కేంద్రం భరించే విధంగానే ఉన్నాయి. ఇందుకు సంబంధించి 2014 మే 28న నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా కేంద్ర మంత్రివర్గం మే 1న స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ స్పష్టమైన దశ - దిశ నిర్దేశం చేయగా - దాని ప్రకారం మొత్తం పనిని ఈపీఏ ఆధ్వర్యంలో కేంద్రం చేపట్టాలి. వీటన్నింటినీ విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం నేరుగా పనులను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ న ఎందుకు నిధులు మొత్తం తాము సమకూర్చలేమని లేఖ ఎందుకు రాసిందనే అంశంపై చర్చ జరగాలి. కానీ చంద్రబాబు దీనిని పూర్తిగా దారి మళ్లించారు.
-----ఎస్ . వి