Begin typing your search above and press return to search.
జనవరి 1 నుంచి రాజమండ్రి కాదు..
By: Tupaki Desk | 22 Dec 2015 4:19 PM GMTతూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం పేరును రాజమహేంద్రవరంగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 1 నుంచి ఈ పేరు అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఏడాది గోదావరి మహా పుష్కరాల ముగింపులో భాగంగా రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది.
గోదావరి మహా పుష్కరాల ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో రాజమహేంద్రవరం పేరే ఉన్నప్పటికీ ఇంగ్లిష్ వారు తాము పిలుచుకోవడానికి వీలుగా రాజమండ్రిగా మార్చారని, దాన్ని మళ్లీ మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజమహేంద్రవరాన్ని ఆధునిక టూరిజం నగరంగా, రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే గామన్... ధవళేశ్వరం బ్యారేజీ చుట్టూ రౌండుగా 35 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతం మొత్తాన్ని అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామన్నారు. తొలివిడతగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జైలు పక్కన ఖాళీగా ఉన్న 50 ఎకరాల స్థలంలో కన్వెన్షన్ - ఎగ్జిబిషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని అన్ని చారిత్రక ఆనవాళ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.