Begin typing your search above and press return to search.
రోజా సస్పెన్షన్ బాబు తప్పిదమా?
By: Tupaki Desk | 19 Dec 2015 11:30 AM GMTనగరి ఎమ్మెల్యే - వైసీపీ మహిళా నేత రోజాను ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ నేతలు ఆమెను సస్పెన్షన్ చేసి పొరపాటు చేశారని వాదిస్తుండగా, సస్పెండ్ చేసి మంచిపనే చేశారని మరికొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ దుమారం రేపే వ్యవహారాల్లో లాభనష్టాలు బేరీజు వేసుకునే బాబు - రోజా విషయంలో వ్యూహాత్మక తప్పిదం చేయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. రోజాను సస్పెండ్ చేసి, ఆమెకు తామే ఉచిత ప్రచారం ఇచ్చామన్న భావనే ఎక్కు వమంది టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. సస్పెండ్ చేయటం ద్వారా రోజాకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు తామే ఇచ్చినట్లయిందని, మహిళలను సెక్స్ రాకెట్ లో దించిన వ్యవహారంపై ఆందోళన చేసినందుకే, తనను సభ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని, రోజా ప్రజల్లోకి వెళితే ఏవిధంగా ఎదుర్కోగలమని పలువురు సీనియర్లు చర్చించుకుంటున్నారు. బహుశా ఈ విషయంలో బాబును ఎవరో తప్పుదోవ పట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళ, లేదా దళితులపై నిర్ణయం తీసుకునే ముందు బాబు సహజంగా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, కానీ రోజా విషయంలో మాత్రం అలాంటి సమీకరణలేవీ పాటించినట్లుగా కనిపించలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సస్పెన్షన్ వ్యవహారం రోజాకు పూర్తి ప్లస్ పాయింటేనని, ఆమెకు రాష్ట్రమంతా తిరిగి కావలసినంత సానుభూతి సంపాదించుకునేందుకు తామే అవకాశం ఇచ్చామని వారు విశ్లేషిస్తున్నారు.
కాల్ మనీలో టీడీపీ నేతలు మహిళల ఆర్థిక అవసరాలను అడ్డుపెట్టుకుని, వ్యభిచారం రొంపిలోకి దింపిన వ్యవహారాన్ని ప్రశ్నించిన విషయంలో మహిళ ను సస్పెండ్ చేయటం, దానికితోడు నోరున్న రోజాను సస్పెండ్ చేయటం వ్యూహాత్మక తప్పిదమేనంటున్నారు. టీడీపీ నేతలు మహిళల పట్ల వ్యవహరిస్తున్న అరాచక విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తనను సస్పెండ్ చేశారని రోజా జనంలోకి, ముఖ్యంగా మహిళల్లోకి వెళ్లి ప్రచారం చేయడం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. రోజా సస్పెన్షన్‌ను ఒక పద్ధతి ప్రకారం చేసి ఉంటే ఆమెకు సానుభూతి వచ్చేది కాదని, మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌ను విమర్శించారు. దానితో ప్రివిలేజ్ కమిటీ దానిని పరిశీలించి, బలరాంపై ఆరునెలలపాటు సస్పెన్షన్ వేటు విధించింది. రోజా విషయంలో కూడా అదే పద్ధతి పాటిస్తే ఎలాంటి వివాదం ఉండేది కాదని, అప్పుడు రోజాకూ సానుభూతి దక్కేది కాదని చెబుతున్నారు.
అయితే, బలరాం కేసుకు, రోజా సస్పెన్షన్ కూ చాలా తేడా ఉందని పార్టీలోని పలువురు వివరిస్తున్నారు. అప్పుడు బలరాం సభ బయట ఉండి స్పీకర్‌ను విమర్శించారు. ఇప్పుడు రోజా సభలో అందరి ఎదుటే సభా నాయకుడిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి తరచూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వల్ల దాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదని విశ్లేషించారు. అదే సమయంలో రోజా సస్పెన్షన్‌ను మరికొందరు సమర్ధిస్తున్నారు. సభలో ఆమె వ్యవహారశైలి మరీ అభ్యంతరం, సహించరానిదిగా మారినందున, ఈ శిక్షకు ఆమె అర్హురాలేనని అంటున్నారు. ఆమె నోటిదురుసు వైఖరి భరించలేనంతగా మారిందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా సొంత పార్టీ అయిన వైసీపీ కంటే అధికార పార్టీ అయిన టీడీపీలోనే రోజాపై భిన్న చర్చ సాగడం ఆసక్తికరమే.