Begin typing your search above and press return to search.
బాబు ఇగోకు పోయి ఇరుక్కున్నారా?
By: Tupaki Desk | 19 March 2016 4:48 AM GMTవిషయం ఏదైనా మనం చూసే కోణంలోనే ఉంటుంది. నాలుగు అడుగులు వెనక్కి వేయటాన్ని వెనక్కి తగ్గినట్లుగా కొందరు ఫీలైతే.. నాలుగు అడుగులు వెనక్కి వేయటాన్ని.. వెనక్కి తగ్గటం కాదని.. మరింద దూసుకెళ్లేందుకు వేసే అడుగులుగా మరికొందరు అభివర్ణిస్తారు. ఇక్కడ నాలుగు అడుగులు వెనక్కి వేయటం అన్నది నిజం. కాకుంటే.. ఆ నిజాన్ని చూసే కోణం ఆధారంగానే వారి వైఖరేంటన్నది ఇట్టే చెప్పొచ్చు.
తాజాగా ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యురాలు ఆర్కే రోజా వివాదం మలుపులు తిరుగుతోంది. గోరుతో పోయే దానికి గొడ్డలి వరకూ వెళ్లినట్లుగా.. సింఫుల్ గా తేల్చేయాల్సిన అంశాన్ని వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకు చెందిన అంశంగా ఏపీ అధికారపక్షం భావించినట్లు కనిపిస్తుంది. రోజా సస్పెన్షన్ లో ఎపిసోడ్ లో చిక్కుముడి అంతా.. ఆమెపై ప్రయోగించిన క్రమశిక్షణా చర్యల సెక్షన్. ఆ సెక్షన్ ప్రకారం ఒక్క సెషన్ కంటే ఎక్కువ సస్పెండ్ చేసే వీల్లేదు. ఆ పాయింట్ నే మొదటి నుంచి చెబుతున్న జగన్ బ్యాచ్ నేతలు.. ఇప్పుడదే పాయింట్ తో కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల్ని మన్నించి.. ప్రస్తుతానికి రోజాను సభకు అనుమతిస్తే పోయిదేమీ లేదు. రెండు రోజులు ఆగిన తర్వాత.. రోజాపై కోర్టు ఇచ్చిన తీర్పును పద్ధతి ప్రకారం డివిజన్ బెంచ్ అప్పీలుకు వెళ్లి.. తమ వాదనను సమర్థంగా వినిపించటం ద్వారా.. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన పక్షంలో వివాదం ముగిసినట్లే.
ఈ రోజు కోర్టు నిర్ణయానికి గౌరవం ఇచ్చి.. ఆ ఆదేశాలకు తగ్గట్లు నడవటం ద్వారా ఏపీ అసెంబ్లీ వివాదానికి బ్రేకులు వేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా వ్యవహరించటం ద్వారా ఇప్పుడు వివాదం మరింత చిక్కుముడులు పడేలా చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యవస్థా సుప్రీం కాదన్నది మర్చిపోకూడదు. ప్రతి వ్యవస్థకు స్పష్టంగానే పరిధిని నిర్ణయించారు. ఒక పెద్ద వ్యవస్థలో.. వివిధ విభాగాలు వ్యవస్థ సక్రమంగా నడిచేందుకు దోహదం చేయాలే కానీ.. ఒకరినొకరు నిందించుకునే ధోరణి ఏ మాత్రం సబబు కాదన్నది మర్చిపోకూడదు.
తాజాగా రోజా ఉదంతం వ్యవస్థల మధ్య స్పర్థలు రేపేదిగా ఉందనటంలో సందేహం లేదు. మొత్తం ఎపిసోడ్ ను చూస్తే రోజా వ్యవహారాన్ని ఏపీ అసెంబ్లీ పర్సనల్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే పెద్ద సమస్యగా మారింది. అనవసర భావోద్వేగాలకు గురి అయినప్పుడు తప్పులు ఎక్కువ దొర్లుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. రోజా విషయంలో ఏపీ అసెంబ్లీ కానీ.. బాబు సర్కారు కానీ విశాల దృక్ఫదంతో వ్యవహరించాలే తప్ప ‘ఇగో’తో వ్యవహరించకూడదు.
దురదృష్టవశాత్తు బాబు సర్కారు ప్రస్తుతం అవసరం లేని ‘ఇగో’ను నెత్తి మీద వేసుకుందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో వివాదాన్ని తుంచే ప్రయత్నం చేయాలే తప్పించి.. పెంచే ప్రయత్నం చేయకూడదన్నది మర్చిపోకూడదు. లేదంటే.. మరిన్ని తిప్పలు తప్పవనే చెప్పాలి. అయినా.. రోజా ఇష్యూలో ఇగోలో ఇరుక్కుపోవాల్సిన అంశం ఏముంది..? కోర్టు ఇచ్చిన ఆదేశాలు మధ్యంతరమే తప్పించి.. అంతిమ తీర్పు కాదు కదా..?