Begin typing your search above and press return to search.
ఆ స్వామిజీల దౌత్యం..బాబులో భయం..
By: Tupaki Desk | 4 March 2019 4:16 AM GMTగత డిసెంబర్ లో జరిగిన ఎన్నిల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల ప్రచారంలో టీడీపీ - కాంగ్రెస్ కలిసి ప్రచారం చేసినా ఓడిపోయింది. చంద్రబాబు - కేసీఆర్ ల మాటల యుద్ధం జోరుగా సాగింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు కూడా జరిపారు.. కొన్ని రోజుల కిందట టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్ గెలుస్తారని పరోక్షంగా చెప్పారు.
అటు ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడు. టీడీపీ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలోనే పక్క రాష్ట్ర తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీంతో కేసీఆర్ సైతం జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీని ఎలాగైనా ఓడించే దిశగా ప్రచారం చేస్తామని కేసీఆర్ సైతం ప్రకటించారు.
ఇదిలా ఉండగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన చిన్నజీయర్ స్వామిని జగన్ శనివారం కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో జగన్ కు సన్నిహితులైన స్వరూపానంద స్వామిని కేసీఆర్ దంపతులు కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ - జగన్ లు ఇద్దరూ ఎన్నికలకు ముందు ఇలా స్వామిజీలను కలవడంపై ప్రత్యర్థి టీడీపీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది..
కేసీఆర్ - జగన్ ల మధ్య స్వామిజీలు దౌత్యం నడిపిస్తున్నారా..? అనే కోణంలో ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కేసీఆర్ కు ఉండడంతో అధికారంలోకి వచ్చారని అంటున్నారు. ఇప్పుడు జగన్ కూడా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో అధికారం చేపడుతాడా..? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు స్వరూపానందేంద్ర స్వామి ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఈ స్వామిజీల దౌత్యం చూసి టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైనట్టు సమాచారం.