Begin typing your search above and press return to search.
బాబు వెనక్కి తగ్గినట్లే...
By: Tupaki Desk | 19 Oct 2016 5:49 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. ప్రతిష్టాత్మంగా రాజధాని అమరావతి నిర్మాణం ఉంటుందని పేర్కొన్న బాబు ఈ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దానిపై కోర్టుకేసులు - సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్విస్ ఛాలెంజ్ కు ప్రత్యామ్నాయామేంటి ? ఎలాంటి జాప్యం లేకుండా అనుకున్న సమయంలోగా అమరావతి నగర నిర్మాణ తొలిదశ పూర్తయ్యేందుకు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలేంటి ? అనే దానిపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. తద్వారా వెనక్కు తగ్గిన సూచనలు ఇచ్చారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజదాని నిర్మాణం ప్రతిపాదన బాగున్నప్పటికీ అమరావతి సీడ్ స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియంతో స్విస్ ఛాలెంజ్ విధానంలో చేసుకున్న ఒప్పందం ఇప్పటికే విమర్శల పాలైంది. ఈ ఒప్పందానికి పోటీపడ్డ బహుళజాతి సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుబట్టాయి. కొందరు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి హైకోర్టు ఇప్పటికే ఈ ఒప్పందాన్ని పున:పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే స్విస్ చాలెంజ్ ఒప్పందాన్ని రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కున్న కొన్ని అధికారాల్ని తొలగిస్తూ ఈ సమావేశం తీర్మానిం చింది. గత పదేళ్ళుగా ఈ అథారిటీయే పరిశ్రమల నిర్మాణానికి తుది అనుమతులు జారీ చేస్తోంది. అయితే ఇది కొత్తగా తెరపైకి తెచ్చిన స్విస్ ఛాలెంజ్ విధానంతోనే చిక్కులొచ్చిపడ్డాయి. ఇంతవరకు ఈ అథారిటీయే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగింది. కొన్ని అధికారాల్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వశాఖలు తాము రూపొందించిన ప్రతిపాదనలు నేరుగా కేబినెట్ దృష్టికి తెచ్చి ఆమోదింపజేసుకునే అవకాశాలేర్పడ్డాయి. అలాగే అమరావతి నిర్మాణానికి వివిధ దశల్లో చేపట్టనున్న టెండర్ల ఖరారు ప్రక్రియకు కూడా కొత్త విధివిధానాల్ని రూపొందించాలన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చింది.
కాగా ఎన్ని ఇబ్బందులెదురైనా 2018 నాటికి అమరావతి నగర తొలిదశ పూర్తికావాలంటూ చంద్రబాబు కరాఖండీగా చెప్పేశారు. అలాగే జపాన్ కు చెందిన జైకా అమరావతి మెట్రోతో చేసుకున్న ఒప్పందంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. జైకా నియమనిబంధనలు ప్రభుత్వానికి అను కూలంగా లేవు. టెండర్ ప్రక్రియను ఖరారు చేసిన ఢిల్లి మెట్రో కార్పొరేషన్ కూడా జైకా ప్రతిపాదనలపై పెదవివిరిచింది. ఫ్రాన్స్ - సింగపూర్ - మలేషియాలకు చెందిన ఇతర సంస్థలు కూడా ఇప్పుడు అమరావతి మెట్రోపై ఆసక్తి ప్రదర్శిస్తున్నందున ప్రత్యామ్నాయ భాగస్తుల్ని ఎంచుకోవాలన్న నిర్ణయాన్ని కూడా కేబినెట్ సమర్ధించుకుంది. అలాగే ఉచిత ఇసుక విధానాన్ని కూడా సమావేశం సమీక్షించింది. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజాధరణ పెరుగుతున్నదీలేందీ మరింత లోతుగా అధ్యయనం చేయించాలని కూడా సమావేశం నిర్ణయించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/