Begin typing your search above and press return to search.
బాబు ధర్మరాజు కాలేకపోతున్నారు ఎందుకు?-1
By: Tupaki Desk | 15 Dec 2015 4:05 AM GMTపదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్లంతా సంబరాలు చేసుకున్నారు. మళ్లీ తమకు మంచి రోజులు వస్తాయని ఆశపడ్డారు. అయితే... చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరయినా తెలుగు తమ్ముళ్లకు ఒరిగింది శూన్యమే. ప్రాంతాన్ని బట్టి నాయకుడు స్థాయిని బట్టి ఏ పార్టీ నేతయినా మనుగడలో ఉండాలంటే రోజుకు వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మందీమార్బలం మెయింటైన్ చేయడం వంటివన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. పదేళ్లు అధికారంలో లేకపోవడంతో జేబులో డబ్బులతోనే నడిపించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతయినా సరే ఏవో ఒక పనులు దొరికితే నాలుగు రాళ్లు మిగుల్చుకోవచ్చని ఆశపడ్డారు. పదేళ్ల కాలంలో చేసిన అప్పులు తీర్చుకోవచ్చని అనుకున్నారు.
గ్రామాల్లో సిమెంటు రోడ్ల పనులో.. పంట కాలువ మరమ్మతులో... ఇంకొకటో ఇంకొకటో కాంట్రాక్టు పనులు దొరుకుతాయని ఆశ పడ్డారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇంతవరకు ఆ దిశగా దృష్టే పెట్టలేదు. పార్టీకి బలమైన కార్యకర్తలు, చోటా నాయకులకు చిన్నాచితకా పనులు దొరికేలా చేసి కాస్త కుదుట పడేలా చేయాలన్న ఆలోచనే ఆయనకు రావడం లేదని రెండో శ్రేణి మదనపడుతోంది. పైగా చాలా జిల్లాల్లో ఇంకా కాంగ్రెస్ నేతల చేతుల్లోంచి మద్యం వ్యాపారాలు టీడీపీ చేతుల్లోకి రాలేదు. ఇసుక దందా సాగుతుందని అనుకుంటున్నా అందులోనూ అన్ని పార్టీలతో పాటు టీడీపీ ఉంది కానీ ప్రత్యేకంగా టీడీపీకి ఒరిగిందేమీ ఉండడం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి చెందుతున్నారు. 'చంద్రన్న సంక్రాంతి కానుకలు' వంటి పథకాలతో పేదలకు కలుగుతున్న లబ్ధి వంటిది కూడా కనీసం తమకు దక్కడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.
అయితే... పార్టీ కార్యకర్తలు - గ్రామ - మండల స్థాయి నాయకులకు ఎలాంటి ఆసరా ఉండడం లేదన్న విషయం చంద్రబాబు వరకు చేరవేసేవారే లేరు. గ్రామాలు - మండలాల్లోని నాయకులు తమతమ ఎమ్మెల్యేలు - ఎంపీలు - మంత్రుల దృష్టికి తమ కష్టాలు తీసుకెళ్తున్నారు. చంద్రబాబుతో చెప్తామని వారు అప్పటికప్పుడు హామీ ఇస్తున్నా ఆ పని చేయలేకపోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పనులు విషయంలో చంద్రబాబు స్థాయిని అందుకోలేకపోతుండడంతో మంత్రులైనా - ఎమ్మెల్యేలైనా ఆయన్ను కలిసినప్పుడు ఆయన చెప్పేది వినడంతోనే సరిపోతోంది. అలాంటి డిఫెన్సివ్ మూమెంట్ లో కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వారికి కాంట్రాక్టు పనులిచ్చి కాస్త సంపాదించుకునే అవకాశం కల్పించండి అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. అలా చెబితే మంత్రులుగా ఉన్న తామే అవినీతిని ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు ఎక్కడ అంటారో అని వారు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్షేత్తస్థాయి తెలుగు తమ్ముళ్ల కష్టాలు చంద్రబాబుకు చేరడం లేదు. ఆయనకు విషయం వివరించే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.
చంద్రబాబు మెడలో గంట కట్టగలిగే సామర్థ్యం ఉన్న లోకేశ్ బాబుకో, యనమల వంటివారికో కార్యకర్తలు మొరపెట్టుకోవడం మంచిది. అశోక్ గజపతి వంటివారు చంద్రబాబుకు చెప్పే స్థాయిలో ఉన్నా ఆయన అసలు కాంట్రాక్టులు చేసి సంపాదించుకోవడం వంటివాటిని పెద్దగా ప్రోత్సహించరు. దీంతో చంద్రబాబుకు తమ బాధలను చేరవేసేవారికోసం తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల కష్టాలు తీర్చినప్పుడే చంద్రబాబు ధర్మరాజు కాగలగుతారు మరి.