Begin typing your search above and press return to search.
తుని ఎపిసోడ్ లో బాబు చేసిన తాజా తప్పు ఇదేనా?
By: Tupaki Desk | 11 Jun 2016 4:56 AM GMTతుని ఎపిసోడ్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తడబడుతున్నారు. కీలక సమయాల్లో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ పై భారీ సభను తునిలో ఏర్పాటు చేసిన సందర్భంగా.. నిఘా వర్గాల వైఫల్యంతో పాటు.. భారీ సభ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలపై బాబు సర్కారు దృష్టి పెట్టకపోవటం ఒక తప్పు అయితే.. చంద్రబాబు సైతం వ్యక్తిగతంగా ఈ తరహా భారీ సభల కారణంగా చోటు చేసుకునే రాజకీయ పరిణామాల గురించి అంచనా వేయటంలో తప్పులో కాలేశారని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తుని ఎపిసోడ్ కు సంబంధించి బాధ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునే విషయంలోనూ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే.. తుని విధ్వంసకాండ జరిగినప్పుడు.. ఈ దారుణానికి రాయలసీమ నుంచి వచ్చిన కొందరి పనే తప్పించి.. గోదావరి జిల్లాలకు చెందిన వారు ఇలాంటి వాటి గురించి అస్సలు తెలీవంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ విధ్వంసకాండకు సంబంధించి చేసిన అరెస్ట్ అన్నీ తూర్పు గోదావరిజిల్లాకు చెందిన వారే కావటం గమనార్హం.
బాబు చెప్పిన మాటలకు రుజువన్నట్లుగా రాయలసీమకు చెందిన కొందరినైనా అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. అందుకు భిన్నంగా విధ్వంస కాండకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులంతా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే కావటంపై రాజకీయ వర్గాలు సైతం తప్పు పడుతున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్నే తీసుకుంటే.. తుని విధ్వంసంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కొందరు బాధ్యులంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని.. అందుకు భిన్నంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురిని అరెస్ట్ చేయటం ఏమిటంటూ ప్రశ్నంచటమే నిదర్శనం. తుని ఎపిసోడ్ కు సంబంధించి తొలి నుంచి తప్పులు చేస్తున్న చంద్రబాబు అండ్ కో.. తాజా అరెస్ట్ ల వ్యవహారంలోనూ ఇదే రీతిలో వ్యవహరించి విమర్శల పాలవుతున్నారని చెప్పొచ్చు.