Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు మిగిలింది మట్టి నీరేనా-1
By: Tupaki Desk | 1 March 2016 6:03 AM GMTఏపీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ పరిపాలకుడు నారా చంద్రబాబు నాయుడు "సంధికాలంలో" పడ్డారా? అనుభవజ్ఞుడైన పరిపాలకుడిగా పేరొందిన బాబు రాజకీయంగా బలోపేతం అవుతున్నప్పటికీ ప్రజల ఆకాంక్షల సాధనలో విఫల నేతగా పునర్ నిర్వచించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? రాష్ర్టాన్ని ఒడ్డున పడేయడటంలో బాబుకు కేంద్రం ఇవ్వాల్సిన చేయూతను అందించకపోవడం వీటన్నింటికీ కారణామా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
బడ్జెట్ నిధుల కేటాయింపులో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం నిర్లక్ష్యాన్ని చూపించింది. అత్యంత కీలకమైన అంశాలకు కూడా కనీస నిధులను కూడా కేటాయించలేదు. కీలకమైన రాజధాని అమరావతి నిర్మాణానికి, ఆదాయంలో లోటు, వెనుక బడిన జిల్లాలకు ఒక్కపైసా కూడా కేటాయించని మోడీ సర్కారు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యమైన పోలవరం ప్రాజెక్టుకు సైతం నామమాత్రంగా వంద కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. ఇక మిగిలిన కొన్ని అంశాలకు చిన్న చిన్న మొత్తాలను విదిలించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులు తప్ప మిగిలిన అన్ని రంగాల్లో నిరాశే మిగిలింది. ఈ ఒక్క విషయంలోనే సానుకూలంగా స్పందించారంటే...రాష్ట్ర హక్కు కాబట్టే ఆ విధంగా ఇచ్చారా అనే సందేహం కలగకమానదు!
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్ర ఖజానా 16,079 కోట్లు లోటుతో ఉందన్న లెక్కల మేరకు ఆ లోటును భర్తీ చేయాలని భావించిన కేంద్రం ఇప్పటివరకు 2,303 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 13,776 కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్ లో కేటాయించాలని కేంద్రాన్ని ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం కోరినప్పటికీ పైసా కూడా కేటాయించలేదు. ఆడిటర్ జనరల్ నుంంచి సానుకూలంగా నివేదిక వెళ్లినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం ఇక్కడ ఆసక్తికరం. నవ్యాంద్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎన్నో అశలు పెట్టుకున్నప్పటికీ కేంద్రం కనికరించలేదు. నాలుగువేల కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్ లో కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే...ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో 1500 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రాన్ని, తాజాగా మరికొంత నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరింది. వచ్చే ఐదేళ్లలో 42,935 కోట్లు కావాలని, అందుకే అమరావతి నిర్మాణానికి, అక్కడ నిర్మించాల్సిన మెట్రో రైల్ నిర్మాణాలకు ప్రాధమికంగా నాలుగు వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ కేంద్రం కనికరించలేదు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్రం శీతకన్ను వేసింది. జాతీయహోదా కట్టబెట్టడం ద్వారా తానే స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొంది. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేసి, తరువాత కేంద్రం నుంచి వాపసు తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడు ఇస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై 1952 కోట్లు ఖర్చు చేసింది. అందులో 345 కోట్లను కేంద్రం వాపసు ఇవ్వగా, ఇంకా 1607 కోట్లు రావాల్సి ఉంది. అలాగే గత ఏడాది మరో 2485 కోట్లు ఖర్చు చేసింది. పాత, కొత్త ఖర్చు కలిపి 4092 కోట్లు అయిందని, అందుకే నాలుగు వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేవలం వంద కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం.