Begin typing your search above and press return to search.

‘హైకోర్టు’.. ‘రాజ్ భవన్’ డబ్బుల్ని బాబు వాడేశారా?

By:  Tupaki Desk   |   14 April 2016 5:39 AM GMT
‘హైకోర్టు’.. ‘రాజ్ భవన్’ డబ్బుల్ని బాబు వాడేశారా?
X
విభజన నేపథ్యంలో ఏపీ సర్కారుకున్న ఆర్థిక లోటు ఎంత తీవ్రమైందో తెలియంది కాదు. మరోవైపు విభజన నేపథ్యంలో తమకు అందించాల్సిన నిధుల విషయంలో కేంద్రం సాచివేత ధోరణిని అనుసరిస్తుందని.. పీనాసితనంతో వ్యవహరిస్తూ.. చిల్లర రాలుస్తుందే తప్పించి.. నిధులు ఇవ్వటం లేదన్నది మరో ఆరోపణ. ఇదిలా ఉంటే.. కేంద్రం వాదన మరోలా ఉంది. తాము నిధుల్ని క్రమపద్ధతిన కేటాయిస్తుంటే.. ఏపీ సర్కారు దుర్వినియోగం చేస్తుందని చెబుతోంది.

తాజాగా బయటకు వచ్చిన ఒక కథనం ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు.. రాజ్ భవన్ భవనాల నరిమాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.850 కోట్లు కేటాయించిందని.. అయితే.. ఆ నిధుల్ని వేరే అవసరాలకు వారేశారన్న ఆరోపణ వినిపిస్తోంది. అమరావతిలో నిర్మించాల్సిన హైకోర్టుకోసం.. గవర్నర్ నివాసం రాజ్ భవన్ కోసం రూ.850కోట్లు ఇస్తే.. ఆ మొత్తాన్ని మిగిలిన అవసరాల కోసం వాడినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన రూ.850కోట్ల నిధుల వినియోగం మీద నీతి అయోగ్ అడిగిన లెక్కల పుణ్యమా అని తాజా వ్యవహారం బయటకు వచ్చిందన్న మాటను చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మాస్టర్ ప్లాన్ ఓకే కాకుండానే భవనాల నిర్మాణానికి కేంద్రం రూ.850 కోట్లు ఎలా ఇస్తారన్నది ఒక ప్రశ్న. కేంద్రం ఇచ్చిన నిధులు నిజంగానే.. రాజ్ భవన్.. హైకోర్టు భవనాల కోసమనే ఇచ్చిందా? లేక.. రాజధాని నిర్మాణ అవసరాలకుఇచ్చిందా? అన్నది మరోప్రశ్న. ఒకవేళ కేంద్రం కానీ భవన నిర్మాణాలకు నిధులు ఇస్తే.. వాటిని అందుకు భిన్నంగా మిగిలిన అవసరాలకు ఎలా ఖర్చుచేశారన్నది సందేహంగా మారింది. ఒకవేళ.. ఆ తప్పు కానీ ఏపీ సర్కారు చేసి ఉంటే.. కేంద్రానికి ఏం సమాధానం చెబుతారన్నది అన్నింటికన్నా పెద్ద ప్రశ్న. మరి.. ఈ ప్రశ్నలకు ఏపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో? ఈ వ్యవహారం మొత్తమ్మీదా.. కేంద్రం కానీ ఫలానా వాటి కోసమే వాడాలన్న నిధుల్ని కానీ.. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తే మాత్రం.. ఏపీ ఇమేజ్ డ్యామేజ్ కావటమే కాదు.. డబ్బు లెక్క విషయంలో ఒక పద్ధతి లేకుండా వ్యవహరించారన్న చెడ్డపేరు మూటకట్టుకోవటం ఖాయం.