Begin typing your search above and press return to search.
కొత్త రాష్ట్రంలో పాత చంద్రబాబు - 4
By: Tupaki Desk | 26 Sep 2015 2:40 PM GMTప్రజాప్రతినిధులు ఆరంభ శూరత్వానికి మారుపేరు... తెలుగు నేల మీదే కాదు, భారతదేశమంతా ఇదే తీరు. అందుకే ఎక్కడా చూసిన పదుల సంవత్సరాల కిందటి శిలాఫలకాలు...సగమే కట్టిన నిర్మాణాలు కనిపిస్తుంటాయి. బోరుంటే దానిక హ్యాండిల్ ఉండదు.. రోడ్డేస్తే, దానికి సైడ్ బర్ములు ఉండవు... ప్రభుత్వం కట్టించే ఇళ్లకు ప్లాస్టింగులు ఉండవు.. మరుగుదొడ్లకు తలుపులు ఉండవు... ఒకటారెండా ఎన్నో ఉదాహరణలు. ప్రభుత్వ పథకాలూ అంతే ప్రారంభించిన ఆర్నెళ్లలోనే దాని గురించి మర్చిపోతారు. చంద్రబాబూ అందుకు భిన్నం కాదని నిరూపించుకుంటున్నారు. నవ్వాంధ్రలో ఘనంగా ప్రకటించిన పథకాలు... ఇంకెక్కడా లేవని, వినూత్నమని చెప్పుకున్నవి ఇప్పుడు చంద్రబాబే మర్చిపోయారు. గట్టిగా ఏడాదిన్నర కూడా కాకముందే చంద్రబాబుకు తన పథకాలపై మతిమరపు వచ్చేసింది. వాటిని అటకెక్కించేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను లోకలైజ్ చేసి కొంత హడావుడి చేశారు చంద్రబాబు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమం అలాంటిదే. కానీ, ఆ హడావుడి అప్పుడే ముగిసింది. స్వచ్ఛత లేదు.. శుభ్రత లేదు. ఇంటికో మరుగుదొడ్డి అన్న మాటే లేదు. ఆపై 'నీరు-చెట్టు" పథకం.. అధికారులు - ప్రజాప్రతినిధులు - మంత్రులు చెరువు గట్లమీదే పడుకోవాలన్నారు చంద్రబాబు. పడుకోవడం కాదు చెరువు గట్టు మీద అడుగుపెట్టేవారే లేరిప్పుడు. ఆ పథకం ఏమైందో తెలియదు. ఇక 'జన్మభూమి-మీ ఊరు"... దీన్ని భారీగా ప్రచారం చేసి ఆ వెంటనే వదిలేశారు.. అయితే, చంద్రబాబు తనయుడు లోకేశ్ దీని ప్రాధాన్యం గుర్తించి అమెరికా వెళ్లి ప్రవాసాంధ్రులను కలిశారు. గ్రామాలను దత్తత తీసుకునేలా చేశారు. ఆయనా కొద్దిరోజులు హడావుడి చేశారు ఇప్పుడు అంతా ఆ విషయం మర్చిపోయారు. ప్రవాసాంధ్రులు రాలేదు, నిధులివ్వలేదు. గ్రామాల్లో పనులు మొదలవ్వలేదు. దీంతో చంద్రబాబుది ప్రచారార్భాటమే తప్ప పనులేమీ జరగడం లేదన్నా ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
ఏడాదిన్నర పాలనలోనే ఇన్ని మతలబులుంటే... పథకాలను పక్కనపెట్టేస్తే ఎలా అన్న ప్రశ్న వినిపిస్తోంది. మంత్రులో, పార్టీ నేతలో చంద్రబాబుకు ఇవన్నీ గుర్తు చేస్తారనుకుంటే అదీ లేదు. అంతా కోటరీ... చంద్రబాబు తానా అంటే తందానా అనే రకమే కానీ, పార్టీకి ప్రజలకు పనికొచ్చే లా సూచనలిచ్చేవారు ఒక్కరు లేరు. దీంతో చంద్రబాబు తోచినట్లు చేసుకుంటూ... నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లుగా సాగిపోతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు మేలుకోకపోతే తీవ్రంగా నష్టపోక తప్పదు.
వైఎస్ కు చంద్రబాబుకు అదే తేడా..
గత పదేళ్ల కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు కలిగించిన లబ్ధిని ఆయన తరువాత వచ్చిన కాంగ్రెస్ పాలకులూ కొంతలో కొంత కొనసాగించారు. ఆరోగ్య శ్రీ, 108, పేదలకు ఇళ్లు, పింఛన్లు వంటివాటికి రాజశేఖరరెడ్డి బాగా ప్రాధాన్యమిచ్చారు. ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలిగేలా చేశారు.... దాంతో, ఈ ప్రభుత్వం నాకేమిచ్చింది అని ప్రజలు అనుకుంటే , వారికి ఎన్నో కనిపించాయి. అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి దేముడయ్యారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలు, తరువాత తరాల కోసం వందేళ్ల ముందుచూపుతో ప్రణాళికలు రచిస్తుండడం నిజమే.. కానీ, మొత్తం దృష్టంతా దానిపైనే ఉంటే ఈతరంలో బతుకుతున్నవారి పరిస్థితి ఏంటి. తరువాత తరానికి బాటలు వేస్తారు నిజమే.. ప్రస్తుత తరాన్ని బాగు చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. చంద్రబాబు ఆ కోణం మిస్సవుతున్నారు. అందుకే ఏడాది కాలంలోనే పదేళ్లకు సరిపడా ప్రభుత్వ వ్యతిరేకత ఎదురుచూస్తున్నారు. వ్యవసాయంతో లాభం లేదని రైతులు... ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు... ఈ ధరలతో బతకలేమంటూ సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిందిస్తున్నారు... ఇవన్నీ చూసైనా చంద్రబాబు అర్థం చేసుకోవాలి. రంగురంగుల రాజధానే కాదు, రాష్ట్ర ప్రజలకు రోజు గడిచే మార్గమూ చూపాలని తెలుసుకోవాలి.... లేదంటే చంద్రబాబు కూడా ప్రజల మనసులోంచి చెరిగిపోతారు.
-గరుడ
Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.