Begin typing your search above and press return to search.

అంతటితో చేతులు దులుపుకోకండి బాబుగారూ...

By:  Tupaki Desk   |   15 March 2018 1:30 PM GMT
అంతటితో చేతులు దులుపుకోకండి బాబుగారూ...
X
చంద్రబాబునాయుడు సమకాలీన దేశ రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు. విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వయస్సు.. చంద్రబాబు అనుభవంతో పోలిస్తే.. కొద్దిగా మాత్రమే ఎక్కువ. అయినా సరే.. తెగువ ఉన్న నాయకుడు గనుక.. జగన్ .. కేంద్రంపై అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబునాయుడుకు బహుశా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు.. అయితే మేం మిత్రపక్షం కదా.. అంటూ.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండగా ఎలా అవిశ్వాసం పెడతాం అంటూ.. రకరకాలుగా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు.

మరోవైపు మీరు తీర్మానం పెడితే మేం మద్దతిస్తాం.. లేదా, మా తీర్మానానికి మీరు మద్దతివ్వండి అని జగన్ అడిగినా తోసిపుచ్చారు. తీరా గురువారం నాటికి ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

అయితే ఎవరో తీర్మానం పెడితే.. మద్దతు ఇవ్వడం వంటి చిన్న పాత్రలో చంద్రబాబునాయుడు ఉండాలని తెలుగుజాతి కోరుకోవడం లేదు.

తెలుగుజాతికి ఆయన మీద ఇంకా చాలా చాలా ఆశలు ఉన్నాయి. అందుకే.. ఆయన కేవలం మద్దతిచ్చి ఊరుకోకుండా.. ఆ బిల్లు ఓటింగుకు వచ్చేదాకా అవసరమైన మద్దతు కూడగట్టడానికి కూడా ప్రయత్నించాలని ప్రజలు అంటున్నారు.

చంద్రబాబునాయుడు కేవలం వైకాపా తీర్మానానికి మద్దతిచ్చి ఊరుకుండిపోతే గనుక.. ఏదో ఒత్తిడి భరించలేక.. అలా చేసినట్లుగా ఉంటుందని.. తన చిత్తశుద్ధిని ఆయన నిరూపించుకోవాలని అనుకుంటే.. పూర్తిగా రంగంలోకి దిగి అవసరమైతే కొన్ని రోజులు ఢిల్లీలో తిష్టవేసి అయినా.. తీర్మానం ఓటింగుకు వచ్చేలా చక్రం తిప్పాలని... తనకున్న సుదీర్ఘ రాజకీయానుభవం - దేశవ్యాప్త నాయకుల పరిచయాలను చంద్రబాబు రాష్ట్ర ప్రయోజానాలను సాధించడానికి, ప్రత్యేకహోదా రాబట్టడానికి ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు.