Begin typing your search above and press return to search.
రూ.2వేల నోట్లు వద్దంటున్న బాబు
By: Tupaki Desk | 10 Nov 2016 5:31 AM GMTపెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని ఊరికే అనలేదేమో. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీపై అందరూ ప్రశంసిస్తుంటే.. అలాంటి నిర్ణయం తీసుకోవాలని గడిచిన కొద్ది కాలంగా నెత్తినోరూ కొట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టించుకున్న వారు లేరు. పెద్దనోట్ల రద్దుతో మోడీని మొనగాడిగా అభివర్ణిస్తున్న వేళ.. పెద్ద నోట్ల రద్దు సలహా తాను ఇచ్చిందేనన్న విషయాన్ని చంద్రబాబు తనకు తానే చెప్పుకునే పరిస్థితి. ఇప్పటికే చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ సర్కారు.. వెయ్యి స్థానే రూ.2వేల నోటును తీసుకువస్తున్నట్లుగా వెల్లడించిన విషయం తెలిసిందే.
పెద్దనోట్లను వ్యతిరేకించే చంద్రబాబు తాజాగా కేంద్రం ప్రకటించిన రూ.2వేల నోటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పెద్దనోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. ఆ స్థానంలో మరింత పెద్ద నోట్లను విడుదల చేయాలన్న నిర్ణయం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రెండువేల నోటు వస్తే.. ఎన్నికల వేళ.. ఓటు విలువ కూడా అంతే అవుతుందన్న అభిప్రాయాన్ని కొంతమేర సమర్థించటం గమనార్హం.
‘‘రెండు వేల రూపాయిల నోటను పరిమితంగా ముద్రించాలి. వాటి కదిలకలపై నిఘా పెట్టాలి. లేదంటే కొందమంది అంటున్నట్లు ఇది ఫ్యామిలీ ప్యాకేజీ అవుతుంది. అలా జరగటానికి వీల్లేదు. ఒక్కసారే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు వేల నోటు వస్తే ఎన్నికల సమయంలో ఓటు విలువ కూడా అంతే అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు.
రూ.2వేల నోటు అవసరమా? లేదా? అన్నది ఆలోచించాలని.. దానిపై చర్చ జరగాలని.. ఒకవేళ వాటిని అమల్లోకితీసుకొచ్చినా.. కొన్నాళ్ల తర్వాత విత్ డ్రా చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో రూ.2వేలు.. రూ.500 నోటు కాకుండా రూ.200 నోటు చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించిన చంద్రబాబు.. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని.. తన లాంటి వారికి ఈ నిర్ణయంతో సుఖంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
‘‘నాలాంటోళ్లు 24 గంటలూ కష్టపడుతున్నారు. ఒక వ్యక్తి ఐదేళ్లు కష్టపడి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళితే.. ఇంకొకరు చివర్లో ఓ సూట్ కేసు తెస్తున్నాడు. సూట్ కేసే గెలుస్తోంది. మన దగ్గర బ్లాక్ మనీ 70 శాతం ఉందని.. అమెరికాలో మాత్రం 14.5 శాతమే ఉంది. వ్యవస్థలోని లోపాల్ని అసరాగా తీసుకొని సమాజాన్ని చెడగొడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలపై ఆధారపడకూడదనే పాతికేళ్ల క్రితం హెరిటేజ్ పెట్టినట్లుగా చెప్పిన చంద్రబాబు.. ఎంత కార్పొరేట్లు అయినా 10.. 20 కోట్ల రూపాయిలు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలని ప్రశ్నించారు.
తాజా నిర్ణయంతో బంగారం.. వెండి నిల్వలు పెరుగుతాయని.. రియల్ ఎస్టేట్ లోనూ దిద్దుబాటు జరుగుతుందని వ్యాఖ్యానించారు. సింగపూర్ లోనూ భూమికి ఇంత విలువ లేదన్న విషయాన్ని బాబు గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాలంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు అంశాన్ని తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. మొన్న నీతిఅయోగ్ ఛైర్మన్ వచ్చినప్పుడు కూడా తానీ విషయాన్ని మాట్లాడినట్లుగా చెప్పారు. 1978లో మొరార్జీ దేశాయ్ పెద్దనోట్లను రద్దు చేశారని.. మళ్లీ ఇంతకాలానికి మోడీ ధైర్యంగా ఆ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/