Begin typing your search above and press return to search.
ట్రావెల్ బ్యాన్...జేసీకి చంద్రబాబు షాక్!
By: Tupaki Desk | 11 July 2017 9:30 AM GMTఅనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఆయన పై కొన్ని విమానయాన సంస్థలు విధించిన ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని జేసీ త్వరగా పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజుతో చర్చించి ట్రావెల్ బ్యాన్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిందిగా జేసీని ఆదేశించినట్టు సమాచారం.
కొద్ది రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ పాస్ విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై జేసీ దురుసుగా ప్రవర్తించి, అక్కడ ప్రింటర్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఇండిగో సిబ్బంది పై జేసీ దురుసు ప్రవర్తనకు నిరసనగా విమానాయానసంస్థలు ఆయనపై ట్రావెల్ బ్యాన్ ను విధించాయి. దీంతో, ఈ విషయం జాతీయ మీడియాలో కూడా పాపులర్ అయింది.
తాజాగా, 2 రోజులక్రితం ట్రూజెట్ - స్పైస్ జెట్ కంపెనీలు తమ విమానాల్లో ఎక్కకుండా జేసీని అడ్డుకున్నాయి. విజయవాడకు వెళ్ళేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొన్న జేసీని ట్రూజెట్ ఎయిర్ లైన్స్ సంస్థ అడ్డుకొంది. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారడంతో ఏపీ సీఎం రంగంలోకి దిగారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సహనంగా ఉండాలని జేసీకి చంద్రబాబు సూచించినట్లు సమాచారం. వీలైనంత తర్వగా ఈ వివాదానికి తెరదించాలని జేసీకి చెప్పినట్లు తెలుస్తోంది.
ఇండిగో సిబ్బందిపై జేసీ దురుసు ప్రవర్తన - ప్రింటర్ ధ్వంసం చేసేందుకు యత్నించడం వంటి ఘటనలు సీసీ కెమెరా ఫుటేజ్ లద్వారా వెల్లడైంది. దీంతో, జేసీతో ఇండిగో సిబ్బందికి క్షమాపణలు చెప్పించి వివాదం సద్దుమణిగేలా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, జేసీ ట్రావెల్ బ్యాన్ వ్యవహారంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ తో సిబ్బందికి క్షమాపణలు చెప్పించినట్లుగానే జేసీ వివాదాన్ని డీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.