Begin typing your search above and press return to search.

బాబు మార్కు మేనేజ్‌ మెంట్‌ షురూ!

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:25 AM GMT
బాబు మార్కు మేనేజ్‌ మెంట్‌ షురూ!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు ఇంకా ఐదు నెల‌ల‌కు పైగానే స‌మ‌యం ఉంది. ఇంకో రెండు నెల‌ల త‌ర్వాత గానీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే ఛాన్స్ లేదు. ఏప్రిల్ లేదంటే మే నెల‌లో జ‌రిగే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న‌ నోటిఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశాలున్నాయంటూ ఇప్ప‌టికే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అంటే ఎటు చూసినా... ఎన్నిక‌లకు ఇంకా ఐదు నెల‌లకు త‌క్కువ కాకుండా స‌మయం ఉంద‌న్న మాట‌. అయితే ఇంత స‌మ‌యం ఉన్నా కూడా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌నదైన మార్కు ఎన్నిక‌ల క‌స‌ర‌త్తులు ఇప్ప‌టికే మొద‌లుపెట్టేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా త‌న సంప్రదాయానికి భిన్నంగా... ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు చంద్ర‌బాబు కస‌ర‌త్తు మొద‌లుపెట్టిన‌ట్లు టీడీపీ అనుకూల మీడియా ఇప్ప‌టికే క‌థ‌నాలు రాసి పారేస్తోంది.

అభ్య‌ర్థుల ఖ‌రారు వ‌ర‌కైతే ఫ‌ర‌వా లేదు గానీ... అన్ని ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల్సిందేన‌ని - లేదంటే త‌న ప‌రిస్థితి తారుమారు కానుంద‌న్న కోణంలో ఆలోచిస్తున్న చంద్ర‌బాబు... ఎన్నిక‌ల‌కు ఇంకా ఐదు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే... ఎన్నిక‌ల్లో తాను అమ‌లు ప‌రిచే త‌న‌దైన పోల్ మేనేజ్ మెంట్‌ కు అప్పుడు బాబు ప‌దును పెడుతున్న‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది... మీ మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌నాన్ని మ‌చ్చిక చేసుకోవ‌డంతో పాటుగా ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర స‌రంజామాను స‌ర్దేసుకోండ‌ని కూడా చంద్ర‌బాబు... త‌న పార్టీ శ్రేణులు... ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలకు ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు నుంచి ఆదేశాలు వెలువ‌డిందే త‌డ‌వుగా... ఆయ‌న మాట అనుస‌రించి న‌డిచేందుకు రంగంలోకి దిగేసిన తెలుగు త‌మ్ముళ్లు... బాబు సూచించిన స‌రంజామాను త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోని త‌మ సేఫ్ జోన్లు - డెన్‌ ల‌కు త‌ర‌లించేస్తున్నార‌ని వినికిడి. ఈ స‌ర్దుబాట్ల‌లో ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌కు పంచేందుకు అవ‌స‌ర‌మైన మ‌ద్యం - ఓటుకింత అని పంచేందుకు అవ‌స‌ర‌మైన క‌రెన్సీ ఉన్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. చంద్ర‌బాబు ఆదేశాలు అందిన వెంట‌నే టీడీపీ ఎమ్మెల్యేలు - పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల‌ ఆయా నియోజక‌వ‌ర్గాల‌కు చెందిన ఇంచార్జీలు ఈ స‌ర్దుడు కార్య‌క్ర‌మంలోనే నిండా మునిగిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి అధికారంలో ఉన్న పార్టీగా... త‌మ నేత‌ల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగానే మ‌ద్యం విక్ర‌యాల‌కు గేట్లు బార్లా తెరిచేసింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

గ‌తానుభ‌వాల‌ను ప‌రిశీలిస్తే... ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌దునైన వ్యూహాలు ర‌చించ‌డంలో చంద్ర‌బాబుకు దిట్ట‌గానే పేరుంది. ఎన్నిక‌ల్లో త‌న పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓట్లు వేస్తార‌ని భావించే వారిని పోలింగ్ కేంద్రాల‌కు ఏ రీతిన ర‌ప్పించాల‌న్న విష‌యంతో పాటుగా... త‌ప్ప‌నిస‌రిగా త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌కు ఓట్లేస్తార‌ని భావించే వారిని పోలింగ్ ద‌రిదాపుల‌కే రానీయ‌కుండ చేసేలా వ్యూహాలు ర‌చించ‌డంలో చంద్ర‌బాబు సిద్ధ‌హ‌స్తుడిగానే పేరున్న విష‌యం తెలిసిందే. అంతేకాకుండా ఎన్నిక‌ల్లో నెగ్గేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండే చంద్ర‌బాబు... గ‌త ఎన్నిక‌ల అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుక‌నే ఎన్నిక‌ల‌కు చాలా గ‌డువు ఉన్నా... ముంద‌స్తుగా మ‌ద్యం - క‌రెన్సీని సిద్ధంగా ఉంచుకోవాల‌ని త‌న పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి... పోలీసు - ఇత‌ర అధికార యంత్రాంగం త‌న చెప్పు చేత‌ల్లోనే ఉంటుంద‌ని, తీరా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌ర్వాత ఈ యంత్రాంగ‌మంతా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోకి వెళ్లిపోతుంద‌న్న భావ‌న నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ముంద‌స్తు క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ఐదు నెల‌ల గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ... చంద్ర‌బాబు త‌న‌దైన మార్కు పోల్ మేనేజ్ మెంట్ కు ప‌దును పెట్టిన‌ట్లుగా వార్త‌లు వెలువడుతున్నాయి.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?