Begin typing your search above and press return to search.
మనకు రాని ఐడియా జగన్ కు ఎందుకొచ్చింది?
By: Tupaki Desk | 3 May 2018 4:40 AM GMTఐడియాలు ఎవరి సొంతం కాదు. బుర్ర పెట్టి కాస్త ఆలోచిస్తే సరి. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రజలేం కోరుకుంటున్నారో వారికి దగ్గరగా ఉంటే.. వారి మనసులో ఏమనుకుంటుందో తెలుస్తుంది. అధికారం వచ్చింది మొదలు.. ఆబగా పవర్ ను ఏంజాయ్ చేయటమే తప్పించి.. ప్రజాసమస్యలు.. వారి ఇష్టాయిష్టాల గురించి తెలుగు తమ్ముళ్లు దృష్టి పెట్టలేదన్న విమర్శ మొదట్నించి వినిపిస్తున్నదే.
టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఎవరూ ఊహించని రీతిలో కృష్ణా జిల్లా పేరు మార్పుపై జగన్ చేసిన ప్రకటన.. అధికారపక్షంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ప్రకటనపై తమ్ముళ్లు ఎవరికి వారు తమదైన విశ్లేషణలు చేయటం షురూ చేశారు. చివరకు బాబు సైతం అదే విషయంపై పదే పదే మాట్లాడటం చూస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతామంటూ జగన్ చేసిన ప్రకటన టీడీపీకి ఎంత షాకింగ్ గా మారిందో ఇట్టే చెప్పొచ్చు.
జగన్ చేసిన ప్రకటనపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు బాబు సూచించారు. కాకుంటే.. ఎలా ఎదురుదాడి చేయాలన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవటంతో ఏం మాట్లాడాలో అర్థం కాక కిందా మీదా పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తిరుపతిలో తాను చేపట్టిన ధర్మపోరాటాన్ని దెబ్బ తీయటానికే జగన్ ప్రకటన చేశారని ఆయన అభిప్రాయ పడుతున్నారు.
రాజకీయం అన్నాక ఎత్తులు.. పైఎత్తులు సహజం. ప్లాన్ చేయటం మనమే చేయాలి.. మరెవరూ చేయకూడదనటం సరికాదు. ప్రతిపక్షం జోరుగా ఉన్నప్పుడు అధికారపక్షం మరింత కష్టపడితే బాగుంటుంది. అంతేకానీ.. చిన్నపిల్లాడి మాదిరి చిందులు వేయటం.. ఉక్రోషాన్ని వ్యక్తం చేయటం బాబు లాంటి సీనియర్ కు నప్పదు.
హోదాపై పలుమార్లు పలు నిర్ణయాలు ప్రకటించిన బాబు.. ఇప్పుడు హోదా సాధనే ధ్యేయమన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. జగన్ పాదయాత్రకు అంతంతకూ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో అలెర్ట్ అయిన బాబు.. తన ధర్మపోరాట దీక్షల్ని మరింత పెంచాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
తిరుపతిలో మాదిరి మిగిలిన జిల్లాల్లో నిర్వహిస్తూ.. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో భారీ ముగింపు సభను నిర్వహించాలన్న ప్లాన్ లో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయంగా మైలేజీ సొంతం చేసుకోవటానికి ఎవరి ప్రయత్నాలు వారు చేయాలే కానీ ఉక్రోషపడిపోవటం.. తమ్ముళ్లపై విరుచుకుపడటం లాంటి వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది.