Begin typing your search above and press return to search.

వివేకా హ‌త్య‌పై హైకోర్టు రూలింగ్‌!..బాబు రాసివ్వాల్సిందే!

By:  Tupaki Desk   |   29 March 2019 5:01 PM GMT
వివేకా హ‌త్య‌పై హైకోర్టు రూలింగ్‌!..బాబు రాసివ్వాల్సిందే!
X
ఏపీలో కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ‌... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి - మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అప్ప‌టిదాకా అటు వైసీపీతో పాటు ఇటు అధికార టీడీపీ కూడా ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు - ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు సంధించుకుంటూ ముందుకు సాగాయి. అయితే వివేకా హ‌త్య అనంత‌రం పూర్తిగా రాజ‌కీయం మారిపోయింది. ఇత‌ర అంశాల‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... వివేకా హ‌త్య‌ను కేంద్రంగా చేసుకుని వైఎస్ ఫ్యామిలీ - వైసీపీల‌పై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సొంతొళ్లే - సొంత కుటుంబ స‌భ్యులే ఈ హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌న్న కోణంలో ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్య‌క్తి ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేస్తే... విచార‌ణ‌లోకి దిగిన సిట్ పై ఆ మాట‌ల ప్ర‌భావం ఎంతో కొంత ఉండే ఉంటుంది క‌దా. ఇలా అస‌లు కార‌ణాలు మ‌రుగున ప‌డిపోగా... వైసీపీనే దోషిగా చూపించేస్తారు క‌దా.

మ‌రి ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇలాంటి ఆధారాలు లేని ఆరోప‌ణ‌లు చేస్తే... వైరి వ‌ర్గాల‌కు ఇబ్బందే క‌దా. ఇదే భావ‌న‌తో హైకోర్టును ఆశ్ర‌యించిన వైసీపీ... ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌ల‌ను క‌ట్ట‌డి చేయాలంటూ విన్నవించింది. దీనిపై విచార‌ణ నిర్వ‌హించిన హైకోర్టు నేడు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఇక‌పై ఎన్నిక‌లు ముగిసే దాకా వివేకా నంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి ఇటు టీడీపీనే కాకుండా అటు వైసీపీ - మిగిలిన ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ కూడా సింగిల్ మాట కూడా మాట్లాడ‌టానికి వీల్లేదంటూ రూలింగ్ ఇచ్చేసింది. అంతేకాకుండా ఎన్నిక‌ల ప్ర‌సంగాల్లో వివేకా హ‌త్య‌ను ప్ర‌స్తావించ‌బోమ‌ని ప్ర‌మాణం కూడా చేయాల‌ని - ఏకంగా ప్ర‌మాణ ప‌త్రం రాసివ్వాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు వాద‌న‌కు అక్క‌డిక‌క్క‌డే స్పందించిన జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది... ఎన్నిక‌ల స‌భ‌ల్లో వివేకా హ‌త్య‌పై జ‌గ‌న్ మాట్లాడ‌రంటూ రాసిచ్చేశారు.

దీంతో వెనువెంట‌నే స్పందించిన హైకోర్టు టీడీపీ త‌ర‌ఫున కూడా ప‌త్రం రాసివ్వాల్సిందేన‌ని కోరింది. ఈ ప‌త్రం టీడీపీ త‌ర‌ఫున న్యాయ‌వాది కాకుండా నేరుగా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబే రాసివ్వాలంటూ కూడా సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే ఇంటెలిజెన్స్ డీజీ బ‌దిలీ విష‌యంలో బొక్క బోర్లా ప‌డిన చంద్ర‌బాబు... కోర్టు ఆదేశాల‌ను పాటించ‌క త‌ప్ప‌ని పరిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌పై ఎన్నిక‌లు ముగిసే దాకా వివేకా హ‌త్య‌పై సింగిల్ మాట కూడా మాట్లాడ‌నంటూ చంద్ర‌బాబు స్వయంగా ప్ర‌మాణ ప‌త్రం రాసివ్వాల్సిందే. మ‌రి హైకోర్టు ఆదేశాల‌ను చంద్ర‌బాబు పాటిస్తారో - లేదంటే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌దిలీపై వ్య‌వ‌హ‌రించిన రీతిలో హైకోర్టు మాట‌ను ప‌క్క‌న‌పెట్టేస్తారో చూడాలి.