Begin typing your search above and press return to search.

‘నగదు రహితం’పై మోడీకి బాబు చెప్పిందిదే..

By:  Tupaki Desk   |   25 Jan 2017 5:03 AM GMT
‘నగదు రహితం’పై మోడీకి బాబు చెప్పిందిదే..
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల్ని పోత్రహించాల్సినఅవసరం ఉంది. ఆ దిశగా ఎంత త్వరగా అడుగులు వేస్తే అంత మంచిది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక కమిటీని కేంద్రంఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్నారు. తాజాగా డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి ఈ కమిటీ కొన్ని సిఫార్సుల్ని.. నగదు రహిత చెల్లింపుల్లోఎదురయ్యే అవరోధాల్నిపేర్కొంటూ ఒక నివేదికను సిద్ధం చేసింది. తాజాగా ప్రధాని మోడీని కలిసిన చంద్రబాబు ఆ నివేదికను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా నగదురహిత చెల్లింపుల్ని పోత్సహించేందుకు.. ప్రజల్ని ఆ దిశగా సమాయుత్తం చేసేందుకు అవసరమైన విధివిధానాల్ని సూచించింది.

అదే సమయంలో డిజిటల్ చెల్లింపులకు ఉన్న ఇబ్బందుల్ని పేర్కొంది. వాటిని అధిగమించేందుకు ఏమేం చేయాలన్న విషయం పైనా స్పష్టత ఇవ్వటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. డిజిటల్ పే మెంట్స్ విషయంలో కేంద్రం ఏం చేస్తే బాగుంటుందన్న విషయంపై సమగ్ర కార్యాచరణను బాబు కమిటీ రూపొందించిందని చెప్పాలి. మరి.. ఆయన చేసిన సిఫార్సుల్లో ఎన్నింటికి బాబు ఓకే అంటారో చూడాలి.

బాబు కమిటీ చేసిన సిఫార్సులు చూస్తే..

= డిజిటల్‌ చెల్లింపులకు అడ్డంకిగా మారిన చార్జీలను ఎత్తేయాలి. డిజిటల్‌ లావాదేవీలు జరిపే వ్యాపారుల పాత లెక్కల్ని పరిగణలోకి తీసుకోవద్దు ఆ లెక్కలపై పన్నులు వేయొద్దు. ఇకపై జరిగే లావాదేవీలకు మాత్రమే పన్నులు వేయాలి.

= మైక్రో ఏటీఎంలు.. బయోమెట్రిక్‌ యంత్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలి. దేశీయంగా వాటిని తయారు చేసేలా ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

=డిజిటల్‌ వినియోగదారులకు వార్షిక ఆదాయంలో పన్ను రీఫండ్‌ ఇవ్వాలి.

= ఆధార్‌ చెల్లింపులకు దుకాణాల్లో బయోమెట్రిక్‌ యంత్రాల వాడకాన్ని పెంచేందుకు సదరు యంత్రాల్ని 50 శాతం రాయితీతో అందించాలి.

= ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించాలి. ఇందుకు రాయితీలు ఇవ్వాలి. ఎలాంటి చార్జీలు వసూలు చేయొద్దు.

= డిజిటల్‌ చెల్లింపుల హార్డ్ వేర్.. మౌలిక సదుపాయాల్ని పెంచటంతో పాటు.. కనెక్టివిటీపైనా దృష్టి సారించాలి.

= అన్ని బ్యాంకుల్నిఅనుసంధానం చేసి.. ఎవరు ఏ బ్యాంకు నుంచైనా ఎక్కడి నుంచైనా చెల్లింపులు జరిపేలా చేయాలి.

= దేశంలోని 1.54 లక్షల పోస్టాఫీసుల్లో ఆధార్‌ ఆధారిత మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయాలి. వాటి ద్వారా ప్రతి బ్యాంకు ఖాతాను వినియోగించేలా మౌలిక సదుపాయాల్ని.. వ్యవస్థలను అభివృద్ధి చేయాలి.

= నగదు రహిత లావాదేవీలతో ఆదా అయ్యే సొమ్మును పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలి.

= సహకార బ్యాంకులు సైతం డిజిటల్‌ లావాదేవీల్ని మొదలుపెట్టాలి.

= డిజిటల్‌ లావాదేవీలపై ఒక విధానాన్ని రూపొందించి.. అథారిటీని ఏర్పాటు చేయాలి. బ్యాంకుల్లో గుర్తింపు పత్రం కింద ఆధార్‌ను స్వీకరించాలి.

భారీ మొత్తంలో జరిగే నగదు లావాదేవీలను నిరోధించాలి. రూ.50వేలకు పైగా నగదు ఉపసంహరణ.. జమ చేయటంపై పన్ను విధించేలా ఏర్పాటు చేయాలి. భారీ నగదు లావాదేవీలకు నిర్ణీత గరిష్ఠ పరిమితి అంశాన్ని పరిశీలించాలి.

= అన్ని ప్రభుత్వ శాఖలు.. సంస్థలు.. బీమా.. విద్యా.. ఎరువులు.. రేషన షాపులు.. పెట్రోలియం తదితర విభాగాలననీ డిజిటల్‌ చెల్లింపులకు మారిపోవాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/