Begin typing your search above and press return to search.

గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో కంటైనర్ నుండి డబ్బు మాయం చేశారా?

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:19 PM GMT
గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో కంటైనర్ నుండి డబ్బు మాయం చేశారా?
X
అధికారం చేతిలో ఉంటే మాయల ఫకీరు సినిమాని నిజంగా చేసి చూపించవచ్చా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. గత కొద్ది గంటలుగా రాష్ట్రం మొత్తాన్ని అట్టుడికిస్తున్న నంద్యాల డబ్బు రవాణా టాపిక్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తొలుత నంద్యాలకు వస్తున్న ఒక ప్యాంట్రీ వెహికల్ లో 200 కోట్ల రూపాయలు పంపిణీ కోసం తీసుకొస్తున్నారన్న వార్త సంచలనం రేపింది.

అది అధికార పార్టీ వాహనమే అని, సాక్ష్యాత్తు ముఖ్య మంత్రి ప్రమేయం కూడా అందులో ఉందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాగా అదంతా ఉట్టిదే అని తేలడంతో ఇది నిజంగా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఒక కథనం బయటికి వచ్చింది. ఆ ప్యాంట్రీ వెహికల్ లో డబ్బు ఉన్న మాట వాస్తవమే అని, గిద్దలూరు నుంచి నంద్యాలకు వచ్చే దారిలో ఉన్న ఘాట్ రోడ్ ని తమకు అనుకూలంగా మార్చుకుని అక్కడ దాదాపు అరగంట సేపు ఆపేసి అదే దారిలో ప్లాన్ ప్రకారం వచ్చిన వోల్వో బస్సులో దాన్ని మార్పిడి చేసారనే వార్త సంచలనం రేపుతోంది. చిమ్మచీకటిగా ఉన్న ఘాట్ రోడ్డులో ఈ తతంగమంతా నడిచిందట.

అందుకే తనిఖీలో ఏమి దొరకలేదని టాక్. ఆ వాహనాన్ని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించిన వైఎస్ ఆర్ సిపి నాయకులు - కార్యకర్తల కళ్ళు గప్పి మరీ ఈ మాయ చేసారని చెప్పుకుంటున్నారు. ఇది ధృవీకరించడం జరగని పని కాబట్టి ఇది కేవలం ఆధారం లేని వార్త గానే పరిగణించాలి. కాని విశ్వసనీయ వర్గాల సమాచారం మాత్రం ఏదో గూడు పుఠాని జరిగింది అనే అంటున్నాయి. ఇది నిజమా అని అడిగితే ఏమో నాకేం ఎరుక అన్న సమాధానమే వినిపిస్తోంది. సిఎం పర్యటన ఉన్న నేపథ్యంలో ఇది ప్రచారంలోకి రావడం సంచలనంగా మారింది