Begin typing your search above and press return to search.
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్...బాబు ఫీలింగ్ ఇదే
By: Tupaki Desk | 12 Dec 2018 12:38 PM GMTతెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు -ఇంచార్జులు పార్టీ బాధ్యులతో ముచ్చటించిన సందర్భంగా బాబు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. `` 2 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే విజయం. 5రాష్ట్రాలలోనూ బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దేశంలో అనేక పార్టీల నేతల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దేశంలో బీజేపీ పాలన పోవాలి. ప్రత్యామ్నాయం కావాలి’ అనేదే అందరి ఆకాంక్ష. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని దేశవ్యాప్తంగా తిరస్కరిస్తున్నారు. టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు దేశవ్యాప్తంగా ఆమోదం`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
బీజేపీయేతర పార్టీల కలయికకు ప్రజామోదం దక్కిందని చంద్రబాబు సూత్రీకరించారు. ``మోడీని నిలువరించాలంటే టీడీపీతోనే సాధ్యం. టీడీపీనే బీజేపీయేతర పార్టీల ఏకీకరణ సాధ్యం. ఇటీవల దేశవ్యాప్త పర్యటనలే అందుకు నిదర్శనం. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏపికి కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయకుండా బీజేపీ నమ్మకద్రోహం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తామంది. హోదా ఇచ్చేది లేదని బీజేపీ పేర్కొంది. అందుకే బీజేపీయే మన ప్రధాన శత్రువు. ఏపికి ద్రోహం చేసినందుకే బీజేపీపై పోరాటం. మోడీ పాలనపై అవిశ్వాసం పెట్టాం. బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నాం. అది గిట్టని బీజేపీ మనపై దాడులను అధికం చేసింది. ఈడి,ఐటి దాడులతో బెదిరించాలని చూస్తోంది. టీడీపీని ఇబ్బందులు పెట్టాలని మోది అనేక ప్రయత్నాలు. మాగుంట సంస్థలపై ఐటి దాడులే అందుకు రుజువు. కేంద్రంలో బీజేపీ నేతలు ఏపీనే టార్గెట్ చేస్తున్నారు. తద్వారా బీజేపీయేతర శక్తుల ఏకీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్నారు`` అని చంద్రబాబు వాపోయారు.
ప్రత్యర్ధుల కుట్రలను తిప్పికొట్టాలి.ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు. బీజేపీ పై పోరాటానికి కేసీఆర్ కలిసిరాలేదని, కలిసి పోటీచేద్దామంటే తిరస్కరించారని చంద్రబాబు అన్నారు. ``ఇద్దరు ముగ్గురితో కలిసి ధర్డ్ ఫ్రంట్ విఫల ప్రయోగమే. బీజేపీకి మేలు చేసే ప్రయత్నమే. అందుకే కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం చేస్తున్నాం. 118సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఒక్కసీటే గెలిచింది. తెలంగాణ ఫలితాలు వేరు. మిగిలిన రాష్ట్రాల ఫలితాలు వేరు. ముందస్తు ఎన్నికల వ్యూహం ఫలించింది.
రెండు రాష్ట్రాలలో తెలుగుదేశం సంస్థాగతంగా బలపడాలి.విద్వేషాలకు టీడీపీ దూరంగా ఉంటుంది. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలి` అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీడీపీని స్థాపించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావొచ్చని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి తనకేదో గిఫ్ట్ ఇస్తానంటున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి.. రావొచ్చంటూ చంద్రబాబు కెసిఆర్ వ్యాఖ్యల పై స్పందించారు.
కాగా, సనత్‌నగర్ నుంచి గెలుపొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమీర్‌పేట సత్యం థియేటర్ అడ్డాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. ``నన్ను ఓడించేందుకు అలీ బాబా దొంగల ముఠాలా సనత్‌నగర్‌కు వచ్చారు. మా మీద సవారీ చేయడానికి వచ్చారు. ఎట్లా వదిలి పెడతాం? వదిలి పెట్టం అంటే కొట్లాడుకోవడం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళతాం. ఆంధ్రాలోనూ వేలు పెడతాం. ఇక్కడ మీరు చేయలేకపోయారు. మేము అక్కడ చేసి చూపెడతాం’ అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.