Begin typing your search above and press return to search.

లాస్ట్ డే.. అధినేతల ప్రచారం ఇక్కడే..

By:  Tupaki Desk   |   9 April 2019 5:41 AM GMT
లాస్ట్ డే.. అధినేతల ప్రచారం ఇక్కడే..
X
ఈ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీల అధినేతలు లాస్ట్ డే ఎక్కడ ప్రచారం చేస్తారనే ఆసక్తి ఏపీ వ్యాప్తంగా నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ - వైసీపీ - జనసేన అధినేతలు బాబు - జగన్ - పవన్ లు చివరి రోజు ప్రసంగాల్లో ఎలాంటి అస్త్రాలను జనంపైకి విసురుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది..

*లోకష్ ను ఓడించడమే లక్ష్యంగా జగన్

జగన్ లాస్ట్ పంచ్ ఏపీ సీఎం కుమారుడు లోకేష్ పై విసరబోతున్నారు. నారా లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జగన్ చివరిరోజు ఎన్నికల ప్రచారం చేయబోతుండం ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. లోకేష్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వైసీపీ అక్కడ చివరి రోజు హోరెత్తించి లోకేష్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే మంగళగరిలో వైసీపీ నాయకురాలు షర్మిల, మోహన్ బాబులు ప్రచారం చేశారు. ఇక ఈరోజు మంగళగిరిలో ప్రచారం చేశాక జగన్.. కర్నూలు జిల్లాలో పర్యటించి ప్రచారం చేస్తారు. అనంతరం చివరి ప్రచార సభను తిరుపతిలో ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం సభ ముగిసాక పులివెందులకు చేరుకొని అక్కడ ముగిస్తారు.ఇక వైఎస్ జగన్ తల్లి విజయమ్మ నేడు చివరిరోజు కర్నూలులో. సోదరి షర్మిల విజయవాడతోపాటు కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

*పల్నాడులో బాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు చివరి రోజు ప్రచారాన్ని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నిర్వహిస్తారు. తొలుత గురజాల లో మొదలుపెట్టి సత్తెనపల్లి మీదుగా తాడికొండ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం చేసి ముగిస్తారు.

*సొంత ఇలాకాలో పవన్ ప్రచారం..

ఇక తను, తన సోదరుడు నాగబాబు పోటీచేస్తున్న కీలకమైన నర్సాపురం పార్లమెంట్ పరిధిలో జనసేనాని పవన్ కళ్యాన్ ప్రచారం చేస్తారు. తన గెలుపుతోపాటు సోదరుడి గెలుపుకోసం పవన్ పాటుపడనున్నారు.

* సెంటిమెంట్ తో రాజేస్తారా.?

తప్పనిసరిగా గెలవాల్సిన సీట్లలో చివరి రోజు వివిధ పార్టీల అధినేతలు ప్రచారానికి ప్లాన్ చేశారు. ఎన్నికల హామీలతోపాటు సెంటిమెంట్ పండించేందుకు నేతలు సిద్ధమైనట్టు సమాచారం. జగన్ నవరత్నాలు, మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తారని చెబుతున్నారు. బాబు ప్రధానంగా కేసీఆర్-మోడీ-జగన్ జట్టుకట్టారనే నినదించనున్నారు. ఇక పవన్ ఈ రెండు పార్టీలకు భిన్నంగా మార్పుకోసం ప్రచారం చేయనున్నారని తెలిసింది. ఇలా ముగ్గురు కీలకమైన స్థానాల్లోనే చివరి రోజు ప్రచారానికి ప్లాన్ చేశారు. మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుందనేది వేచిచూడాల్సిందే..