Begin typing your search above and press return to search.
యాపిల్.. డెల్.. బెల్ తో బాబుకు దెబ్బా?
By: Tupaki Desk | 9 May 2017 9:17 AM GMTగతంలోలా పరిస్థితులు ఇప్పుడు లేవు. గతంలో ఏదైనా చెప్పినా.. గొప్పగా ప్రచారం చేసుకున్నా.. జనాలు విని ఆనందించేవారు.. కరిగిపోయే కాలంతో మరిచిపోయేవారు. కానీ.. ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకని పరిస్థితి. పెరగిన టెక్నాలజీ పుణ్యమా అని ప్రతిదీ ప్రతిఒక్కరూ రికార్డు చేసుకునేస్తున్నారు. గొప్పలు చెప్పిన విషయాల్ని.. వారి మాటల్నివీడియోల్లోనూ.. పేపర్ కటింగ్ లతో సహా.. దగ్గర పెట్టుకొని.. సమయం చూసుకొని ఉతికి ఆరేస్తున్నారు.
దీంతో.. ఉత్త పుణ్యమానికి గొప్పలు చెప్పుకున్నా కుదరని పరిస్థితి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అమెరికా పర్యటనలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బాబు జరిపిన విదేశీ పర్యటలనకు భిన్నంగా ఆయన చాలానే సాధించేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యాపిల్.. డెల్.. బెల్ లాంటి కంపెనీలు ఏపీకి వచ్చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి తగ్గట్లే ఏపీ అధికారపక్ష సభ్యులు గొప్పలు చెప్పుకోవటం మొదలైంది. అది ఎంతవరకు వెళ్లిందంటే.. బాబే ఏపీకి పెద్ద హోదా అంటూ పొగిడే్స్తున్నారు. ఓపక్క విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు కాకపోవటానికి..మోడీతో పాటు బాబు కూడా కారణమన్న భావన వ్యక్తమవుతున్న వేళ.. బాబే ఏపీకి పెద్ద హోదాగా పేర్కొనటంపై పలువురు తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే.. టీడీపీలో మరో వర్గం తాజాగా జరుగుతున్న ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికలు రెండేళ్లకు తగ్గిపోయిన వేళ.. పేరు మోసిన కంపెనీలు ఏపీకి వచ్చేస్తున్నాయంటూ ఉదరగొట్టేస్తూ.. అన్నివేల ఉద్యోగాలు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారని.. ఒకవేళ ఆ విషయంలో ఏదైనా తేడా జరిగితే.. జరిగే నష్టం భారీగా ఉంటుందంటున్నారు.
ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీ మాట చెప్పినంత ఈజీగా వచ్చేయదని.. ఆ తర్వాత ఎన్నో అంశాలు ఉంటాయని.. ఏ క్షణంలో అయినా డీల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని.. ఇలాంటప్పుడు తొందరపడి హైప్ క్రియేట్ చేయటం.. ఫ్యూచర్లో పెద్ద దెబ్బ అవుతుందన్న మాట వినిపిస్తోంది.మరి.. కొందరి తమ్ముళ్లు సందేహం నిజం అవుతుందా? ఇప్పుడు చెబుతున్న గొప్పలన్నీ ఎంత మేర నిజం అవుతాయన్నది కాలమే చెప్పాలి. ఇవాల్టి గొప్పలు.. రేపటికి తిప్పలుగా మారకుండా ఉండేలా జాగ్రత్త వహించాలని కొందరు అధికారపక్ష నేతలు తమ వ్యక్తిగత సంభాషణల్లో చెప్పుకోవటం గమనార్హం.