Begin typing your search above and press return to search.
హైదరాబాద్ రికార్డ్ కోసం బాబు ప్రయత్నం
By: Tupaki Desk | 28 Oct 2016 10:14 AM GMTఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నిర్మించిన ఫైనాన్సియల్ డిస్ట్రిక్ విజయవంతం కావడంతో ఆదే తరహాలో అమరావతిలో కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతికే తలమానికంగా నిలిచేలా.. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్న ఫైనాన్సియల్ డిస్ట్రిక్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తీర్చిదిద్దనున్నారు. హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇపుడు పెట్టుబడులు ఆకర్షించడానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అమరావతికి సైతం అదే రీతిలో ఉండేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ పర్యటనపై ఉత్సుకత నెలకొంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం జైట్లీ రెండు అంశాలపై ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇచ్చిన హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తామని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని, నిర్థిష్టమైన హామీ ఇచ్చే అవకాశాలున్నాయి. ప్రతేక హోదాకు ససేమిరా అంటున్న కేంద్రం అంతకు మించి మరెన్నొ రెట్లు ఎపికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుందనే సంకేతాలను ఆర్థికమంత్రి ప్యాకేజీకి చట్టబద్ధత ద్వారా ఇవ్వనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మరింత వేగవంతమైన నేపథ్యంలో దీనికి కూడా చట్టబద్ధతకు సంబంధించిన ఆర్థికమంత్రి ప్రస్థావించే వీలుందని భావిస్తున్నారు. రాష్ట్రానికి అమరావతి పేరిట కొత్త రాజధాని నిర్మాణం నేపథ్యంలో భూములు ఇచ్చిన రైతులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. భూముల విలువ కోట్లకు పడగెత్తినప్పటికీ 30శాతం పన్ను విధింపుతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక నిబంధన కింద 30 శాతం పన్నును మినహాయించే విషయమై కేంద్ర ఆర్థికశాఖమంత్రి ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/