Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..ఇప్పుడెందుకు?

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:44 PM GMT
ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌..ఇప్పుడెందుకు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. కొద్దికాలం క్రితం వ‌ర‌కు చ‌ర్చ‌నీయాంశంగా ఉంచి అనంత‌రం మూల‌న ప‌డేసిన ఆస‌క్తిక‌ర అంశం గురించి ఆయ‌న మ‌ళ్లీ మాట్లాడారు. అదే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ముస్లింల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తొలి విడతిగా హాజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ముస్లిం మైనార్టీల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ సంద‌ర్భంగానే మంత్రి ప‌ద‌వి హామీ ఇచ్చారు.

అయితే, ఇప్పుడే ఎందుకు చంద్ర‌బాబు ఈ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌నేది అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించే అంశం. ఇందుకు ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నుండి ఎన్డీఏ నుండి తెలుగుదేశం పార్టీ తప్పుకోవటంతో రాష్ట్ర మంత్రివర్గానికి బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేశారు. దాంతో దాదాపు రెండు నెలలుగా వారి స్ధానాలు భర్తీ కాకుండా అలానే ఉండిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు బాబు స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఈనెల 20న తేదీలోగా ముహుర్తం సిద్ధం చేస్తార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు బీజేపీతో నాలుగేళ్లుగా అంట‌కాగిన చంద్ర‌బాబు ఇటీవ‌ల ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ...బాబుకు బీజేపీకి మ‌ధ్య దోస్తీ ఉంద‌నేందుకు అనేక తార్కాణాలు ఉన్నాయి. సాక్షాత్తు పార్ల‌మెంటు సాక్షిగా బాబు త‌మ ఆప్తుడ‌ని కేంద్ర‌మంత్రులు చెప్ప‌డం - మ‌రోవైపు పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు బీజేపీ ముఖ్యుల‌తో బాబుతో ట‌చ్‌ లో ఉంటున్న నేప‌థ్యంలో బీజేపీ ప‌ట్ల బాబు వ్య‌తిరేక‌త‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధానంగా ముస్లింల‌కు చేరువ అయ్యేందుకు చంద్ర‌బాబు మైనార్టీల‌కు మంత్రి ప‌ద‌వి అనే అజెండాను తెర‌మీద‌కు తెచ్చిన‌ట్లు టాక్‌.