Begin typing your search above and press return to search.

అమరావతిలో సైకిల్ 'బే'లు

By:  Tupaki Desk   |   7 Sep 2015 10:44 AM GMT
అమరావతిలో సైకిల్ బేలు
X
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో ప్రత్యేకంగా సైకిల్ బాటలు నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ను ఆ విధంగా రూపొందిస్తున్నారు కూడా. సైకిల్ బేలు ఇప్పుడు విదేశాల్లో చాలా సర్వసాధారణం అయ్యాయి.

ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పడు కార్లు పెరిగిపోయాయి. వాటి తర్వాతి స్థానం బైకులది. రోడ్లపై ఎక్కడ చూసినా కార్లు, బైకులే. దాంతో జనాలు నడవడం మార్చిపోయారు. అయితే, పాశ్చాత్య దేశాల్లో నడవాలని లేదా సైకిలింగ్ చేయాలని, అదే ఆరోగ్యాన్ని పెంచి పోషించడంతోపాటు పర్యావరణ కాలుష్య నియంత్రణకు దీనికి మించిన మార్గం లేదని నిర్ణయించారు. అందుకే విదేశాల్లో ప్రత్యేకంగా సైకిల్ బేలు నిర్మిస్తున్నారు. సైకిల్ మీద కార్యాలయాలకు వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ లు కూడా ఇస్తున్నారు.

ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి పెద్దపీట వేసే చంద్రబాబు నాయుడు అమరావతిలో సైకిల్ బేలు ఉండాలని నిర్ణయించారు. ఇక్కడ దాదాపు వంద అడుగులకు పైన రోడ్లు ఉంటాయి. వీటిలో విదేశాల తరహాలో కార్లకు రెండు మార్గాలు ఉంటాయి. బైకులకు ఒక మార్గం ఉంటుంది. రోడ్లు చివర్లో ఒక మార్గాన్ని మాత్రం సైకిళ్లకు ప్రత్యేకించాలని, డిజైన్ లను కూడా ఆ విధంగానే రూపొందించాలని సింగపూర్ నిపుణులకు ఆయన సూచించారు.