Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో రియ‌ల్ భూమ్ కోసం బాబు ఎత్తుగ‌డ‌

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:10 AM GMT
అమ‌రావ‌తిలో రియ‌ల్ భూమ్ కోసం బాబు ఎత్తుగ‌డ‌
X
ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించిన స‌మ‌యంలో భారీ ఎత్తున భూముల ధ‌ర‌లు పెర‌గ‌టం.. ఒక‌ద‌శ‌లో సెన్సెక్స్ ను పోటీ ప‌డుతూ రోజుకో రేటుతో మ‌హా సంద‌డిగా మారింది. పెద్ద ఎత్తున క్ర‌య విక్ర‌యాలు జ‌రిగాయి. ఒక‌ద‌శ‌లో హైద‌రాబాద్‌ కు చెందిన ప‌లువురు రియ‌ల్ట‌ర్లు అమ‌రావ‌తి మీద ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు.

అయితే.. బాబు చెప్పేదంత ఉత్త సినిమానే త‌ప్పించి.. రియ‌ల్ కాద‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెర‌గ‌టం.. అదే స‌మ‌యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో క‌టీఫ్ చెప్ప‌టంతో అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ డామ్మ‌ని పేలిపోయింది. దీంతో.. అమ‌రావ‌తి ప‌రిధిలోని భూముల ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. దీనికి తోడు.. భూముల బుక్ వాల్యూ త‌క్కువ‌గా ఉండ‌టం.. మార్కెట్ వాల్యూకు సంబంధం లేనంత‌గా ఉండ‌టంతో.. ఏపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని చెబుతున్నారు.

అమ‌రావ‌తి ప‌రిధిలో ఉన్న 29 గ్రామాల ప‌రిధిలో ప్ర‌స్తుతం ఉన్న భూమి ధ‌ర‌ల్ని భారీగా పెంచేస్తూ నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాజ‌ధాని కోసం భూస‌మీక‌ర‌ణ చేప‌ట్టిన గ్రామాల భూముల విలువ‌ల్ని భారీగా పెంచ‌టం ద్వారా రియ‌ల్ రంగాన్ని ఆక‌ర్షించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌ధాని ప‌రిధిలో అతి త‌క్కువ‌గా చ‌ద‌ర‌పు గ‌జం విలువ రూ.600 నుంచి రూ.2వేల వ‌ర‌కూ ఉంది.

దీన్ని అధికారికంగా పెంచ‌టం ద్వారా.. భూముల‌కు కొత్త విలువ రావ‌టంతో పాటు.. రియ‌ల్ వ్యాపారం మ‌రింత జోరుగా సాగే వీలుంద‌ని చెబుతున్నారు. ధ‌ర‌ల్ని పెంచ‌టం ద్వారా.. ఏదో కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్న భావ‌న తీసుకొస్తే.. అది పాజిటివ్ గా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏపీలోని అన్ని ప్రాంతాల‌తో పోలిస్తే.. అమ‌రావ‌తిలో అధికారిక ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఎక్క‌డైనా భూముల ధ‌ర‌ల్ని పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే.. అప్ప‌టికే ఉన్న దానికి ప‌ది శాతం అధికంగా ధ‌ర‌ల్ని పెంచుతారు. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా భారీఎత్తున భూమి ధ‌ర‌ల్ని పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల్ని ప‌క్క‌న పెట్టేసి.. గ‌జం విలువ‌ను క‌నీసం ఐదారు వేలకు ఫిక్స్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

రాజ‌ధాని ప్రాంతంలో రైతులు ఇచ్చిన భూముల‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న భూముల్ని వెన‌క్కి ఇవ్వ‌టం.. ఫ్లాట్లుగా మార్కింగ్ పూర్తి అయిన నేప‌థ్యంలో భూముల్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చే ప‌నిలో భాగంగా రికార్డుల్లో భూముల ధ‌ర‌ల్ని పెంచే ప‌నికి బాబు స‌ర్కారు శ్రీ‌కారం చుట్టింద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై విమ‌ర్శ కూడా లేక‌పోలేదు. బ‌డా బాబులు కారుచౌక‌గా తాము సేక‌రించిన భూముల‌కు కొత్త విలువ‌లు తెచ్చుకునేందుకు వీలుగా బాబు స‌ర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చార‌ని.. అందులో భాగంగానే.. అమ‌రావ‌తి ప్రాంత భూముల విలువ‌ల్ని పెంచేందుకు సిద్ధ‌మ‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది.