Begin typing your search above and press return to search.
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకేనా.. బాబుగారూ?
By: Tupaki Desk | 5 Jan 2018 11:09 AM GMTచంద్రబాబు నాయుడు అన్నీ చాలా చిత్రమైన లెక్కలు చెప్పేస్తుంటారు. ఒక్కోసారి ఆయన మాటలు జనానికి నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రభుత్వాన్ని నవ్వుల పాలు చేస్తుంటాయి. ‘‘తానుగా వెళితే మజ్జిగకు గతి లేదుకానీ.. పెరుగుకు చీటీ ఇచ్చాట్ట’’ అనే సామెత చందంగా చంద్రబాబునాయుడు వైఖరి ఉన్నదని కూడా జనం అనుకుంటూ ఉంటారు. తాను వెళ్లి స్టడీ చేస్తేనే పనులు కావడం లేదు.. అధికార్లను ప్రపంచం తిప్పినంత మాత్రాన పనులౌతాయా అనేది జనంలో సందేహం. ఒక్క ఫ్లైఓవర్ వంతెను పనులు అనుకున్న కాలంలో కాదు కదా.. అంతకు రెట్టింపు కాలంలోనైనా పూర్తి చేయించడానికి దోవలేదు గానీ... అమరావతి నగరాన్ని మొత్తం అత్యద్భుతమైన - పోల్చడానికి వీల్లేనంత గొప్ప వారధుల నగరంగా తీర్చిదిద్దేస్తా అని చంద్రబాబునాయుడు అంటోంటే.. జనం నవ్వుకుంటున్నారు.
2016లో కృష్ణా నదికి పుష్కరాలు వచ్చాయి. దానికి కొన్ని నెలల ముందు దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభం అయ్యేలోగా ఈ ఫ్లైఓవర్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేసేస్తాం అని ఈ ఇద్దరు నేతలూ చాలా ఆర్బాటంగా ప్రకటించారు. పుష్కరాల్లో విజయవాడకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఆలోగానే ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చంద్రబాబునాయుడు సెలవిచ్చారు.
పుష్కరాలు వచ్చాయి.. జనం ఆ పనుల కారణంగా నానా యాతనలు పడ్డారు. అయిపోయింది. 2017లో కావేరీ నదికి కూడా పుష్కరాలు వచ్చాయి. ఈ ఏడాది మరో నదికి కూడా పుష్కరాలు రాబోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి గానీ.. దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రరాజధానిగా భావిస్తున్న కీలక నగరం నడిబొడ్డున.. ఒక్క ఫ్లైఓవర్ ను ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయించలేకపోతోంది. గతంలో.. డిసెంబరులోగా ఇది పూర్తి కాకపోతే.. అంతు చూస్తా అనే రేంజిలో చంద్రబాబు ఓ సమీక్ష సమావేశంలో బెదిరించారు. తీరా ఇప్పుడు మార్చి నెలాఖరుకు ఫ్లైఓవర్ పూర్తవుతుందని కొత్త సమీక్ష సమావేశాల్లో అంటున్నారు. ఒక వంతెన నిర్మాణం విషయంలోనే ఇంత అసమర్థమైనదిగా తేలిపోతున్న ప్రభుత్వం.. అమరావతి నగరం మొత్తం అద్భుత వారధులను అసలు కట్టగలుగుతుందా? వారికి సాధ్యమౌతుందా అని జనం అనుకుంటున్నారు.
అమరావతి నగరంలో కృష్ణ నది మీద ప్రపంచంలోని బెస్ట్ బ్రిడ్జిల నమూనాలతో వారధులు ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు అధికార్లను పురమాయించారు. అవసరమైతే విదేశాలు తిరిగి అక్కడి వంతెనలు స్టడీ చేసి రావాలని చెప్పారు. అయితే.. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందో ఏంటే.. చంద్రబాబు మాటలు వింటూ.. దుర్గగుడి ఫ్లైఓవర్ పరిస్థితి చూస్తోంటే.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగబాకుతా అన్నట్లుగా ఉన్నదని పలువురు హేళన చేస్తున్నారు.