Begin typing your search above and press return to search.
చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఇదే!
By: Tupaki Desk | 3 Nov 2018 1:23 PM GMTమోడీ ప్రధాని మోడీ అయ్యారు. అమరావతికి వచ్చారు. మట్టి నీళ్లు ఇచ్చారు. వెళ్లిపోయారు. ఇక అంతే... ఆ తర్వాత మెల్లగా బాబు విశ్వరూపం తెలిసి దూరం పెట్టేశారు. బాబుపై ఉన్న అవినీతి మచ్చ తనకెందుకు అనుకుని దూరం జరిగారు. ప్రస్తుతం ఇది ప్రజల్లో ఉన్న టాక్. అయితే, పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవరలేరు కాబట్టి చివరకు అన్ని పార్టీలు అయిపోయి ఏం చేసేది లేక కాంగ్రెస్ కు జై అన్నారు. అనుకున్నది జరిగింది. జనం తిట్టినా ఒక అండ అయితే దొరికింది. ఇపుడు ఆ అండను మురిపించాలి. మెప్పించాలి. దానికి ఓ ఐడియా కావాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అదే అమరావతి సభ.
ఇంతకాలం కాంగ్రెస్ ను పాతరేయండి. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి మన ఉసురుపోసుకుంది. దానిని రాష్ట్రం నుంచి తరిమేయండి. అంటూ చంద్రబాబు గత ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన విషయం విదితమే. పాపం బాబు నటనకు జనం పడిపోయారు. అయితే, రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన చంద్రబాబుకు రాహుల్ ఒక షరతు పెట్టారట. మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ను బాగా డ్యామేజ్ చేశారు. దాన్ని మళ్లీ మీరే తుడి చేయాలి అని అన్నారట. మాట మార్చడంలో దానిని కన్విన్స్ చేసుకోవడంలో అందెవేసిన చెయ్యి కదా బాబుది. అదెంత పని చిటికెలో చేసేస్తానని చంద్రబాబు రాహుల్ కు హామీ ఇచ్చారట. దాని ఫలితమే అమరావతి సభ.
ఎక్కడైతే, ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం శంకుస్థాపన చేయించి కాంగ్రెస్ ను తిట్టించారో అక్కడే మళ్లీ సభ పెట్టించడానికి చంద్రబాబు ప్లాన్ చేశారట. రాహుల్ కు మాట ఇచ్చినట్టు అదే సభలో కాంగ్రెస్ అవసరం దేశానికి - రాష్ట్రానికి ఎంత ఉందో బాబు పొగడబోతున్నారట. రాహుల్ తో పాటు దేశంలో కూటమి నేతలందరినీ పిలిచి మోడీని తిట్టించి రాహుల్ ఇగోను శాటి స్ఫై చేయడంతో పాటు. మీకు, నాకు మోడీ అన్యాయం చేశారు. కాంగ్రెస్ కు ఓటేద్దాం. దేశాన్ని (అంటే తెలుగుదేశాన్ని) గెలిపించుకుందాం అని నినదించనున్నారట చంద్రబాబు. బాబు ఎన్నిసార్లు గేలాలు వేసినా తెలుగు ప్రజలు పడిపోతారు అని చంద్రబాబుకు బాగా నమ్మకం. వారెవ్వా... భలే ఐడియా బాబు. ఇరగదీయిపో నువ్వు.