Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఎత్తు ఎంతంటే?

By:  Tupaki Desk   |   8 April 2016 9:56 AM GMT
హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఎత్తు ఎంతంటే?
X
ఎన్నో ప్రత్యేకతలకు వేదికైన హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకతను సొంతం చేసుకోబోతోంది. చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు... హుస్సేన్ సాగర్ నడుమ ఆకట్టుకునే బుద్ధ ప్రతిమ - ఇస్లాం నిర్మాణ రీతులకు ఆలవాలమైన నిర్మాణాలు - మహళ్లు వంటివెన్నో హైదరాబాద్ కు తలమానికంగా నిలుస్తాయి. వీటికి తోడు ఇప్పుడు హైదరాబాద్ మరో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయబోతోంది.

హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం కానుంది. కేసీఆర్ సర్కారు ఇప్పటికే ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అంబేడ్కర్‌ జయంతి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా ఏపీ రాజధాని అమరావతిలోనూ అంబేద్కర్ విగ్రహాన్ని భారీ సైజులో నిర్మించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సామాజిక వర్గాల ఓట్లు కోసం పార్టీల పోరు కీలకమవుతున్న దశలో ఎస్సీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ ను అందుకు ఎరగా వాడుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.