Begin typing your search above and press return to search.
బాబు సమర్పించు.. ‘కాల్ సెంటర్’
By: Tupaki Desk | 16 Feb 2017 6:52 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన భిన్నంగా ఉంటుంది. పని జరుగుతున్నా లేకున్నా.. జరుగుతున్న భావన కలిగించే హడావుడి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. తాము చేసిన పనులకు సంబంధించి ప్రచారం జరగాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కానీ.. బాబుతో వచ్చిన చిక్కేమిటంటే.. పనుల కంటే కూడా ప్రచారం ఎంత బాగా జరుగుతుందన్న విషయం మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మొన్నటికి మొన్న విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు ముచ్చటే తీసుకోండి. ఎవరు పెట్టుబడి పెడతామన్నారో? ఎలాంటి వ్యాపారాలు చేస్తారన్నది పక్కన పెడితే.. రూ.10లక్షల కోట్లు ఏపీకి రానున్నట్లుగా తేల్చేశారు. అంత భారీ ఫిగర్ విన్నాక వావ్ అనేద్దామనుకుంటే.. గత ఏడాది ఇదే విధంగా చెప్పిన నాలుగైదు లక్షల కోట్ల పెట్టుబడులలో ఎన్ని వందల కోట్లు వచ్చాయి బాబుగారు అని అడిగితే సమాధానం లభించని పరిస్థితి.
ఈ తీరులో సాగుతుంది బాబుగారి జమానా. పని కంటే ప్రచారం మీద ఎక్కువ ఫోకస్ చేసే చంద్రబాబు సర్కారు.. మరో భారీ ఖర్చుకు తెర తీసింది. అదేమంటే.. ఏపీసర్కారు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలా అమలు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు భారీ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు.
ఇందుకోసం 500 మందితో ఈ కాల్ సెంటర్ ను తీర్చిదిద్దనున్నారు. ఏపీ రాజధాని అమరావతికి దగ్గర్లోని విజయవాడ శివార్లలోని గుంటుపల్లిలో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ప్రభుత్వ పథకాల అమలుపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంప్లైంట్ చేసే వీలుంది. తాజాగా మాత్రం.. లబ్దిదారులకు నేరుగా ఫోన్లు చేసి.. వారి నుంచి సమాచారం సేకరించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పథకాల అమలు తీరు.. లబ్థిదారులకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తారు. వాటిని ఆయా శాఖలకు అందిస్తారు. వినేందుకు ఈ ప్లాన్ బాగానే ఉన్నా.. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే.. భారీ ఖర్చు కళ్ల ముందు కదలాడి బైర్లు కమ్మేలా చేస్తుందని చెప్పాలి. ఆధునాత భవనంలో 500 మంది సిబ్బందితో నడిచే ఈ కాల్ సెంటర్ తో వందలాది కోట్లు ఖర్చు కావటం ఖాయం. ఇలాంటివి ప్రచారానికే కానీ.. ప్రాక్టికల్ గా ఎంతవరకూ వర్క్ వుట్ అవుతాయన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సంతృప్తికర సమాధారం లభించని పరిస్థితి. ఇలాంటి ఖర్చులు బాబుకు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/