Begin typing your search above and press return to search.
ఏపీ బాగు కోసమే వెంకన్న బతికించాడట..
By: Tupaki Desk | 13 Nov 2015 10:41 AM GMTఏపీ సీఎం చంద్రబాబునాయుడు 2003లో అలిపిరి వద్ద బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన నుంచి తాను బతికిబయటపడడం ఆంధ్రప్రదేశ్ కోసమేనని ఆయన చెబుతున్నారు. ఏపీ కోసమే వెంకటేశ్వరస్వామి తనను బతికించాడన చంద్రబాబు చెబుతున్నారు.
2003లో తనను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బతికించాడని, విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీని బాగు చేయాలనే స్వామివారు తనను ఆశీర్వదించి, బతికించారని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న టిడిపి దిశా నిర్దేశ సదస్సును శుక్రవారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపైన ఉందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యమన్నారు.
హంద్రీనీవా ద్వారా రాబోయే జూన్ నాటికి చిత్తూరుకు నీళ్లు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ఆరున్నర నెలల్లో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత టిడిపిదే అన్నారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పారు. కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నం తమ ప్రాంతానికి అన్యాయం అంటూ కొందరు కొత్త గళం విప్పుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా చంద్రబాబు మండిపడ్డారు. కొందరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం అంటూ కొత్త గళం విప్పుతున్నారన్నారు. ఏ జిల్లాను వదలమని, అన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు.