Begin typing your search above and press return to search.
బాహుబలి: ఆస్కార్ కు బాబు సిఫార్సు!
By: Tupaki Desk | 3 May 2017 5:07 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రెండ్ కు తగ్గట్లు మాట్లాడాలనుకునే ప్రయత్నాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు చంద్రబాబు. తాజాగా ఆయన మాటల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గడిచిన కొద్దిరోజులుగా తెలుగు వారు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరి నోళ్లలో అదే పనిగా నానిన బాహుబలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాల్ని అందరికి అర్థమయ్యేలా చేసిన బాహుబలి మూవీని అస్కార్ కు సిఫార్సు చేయాల్సిందిగా తాను కేంద్రాన్ని కోరతానని వ్యాఖ్యానించారు చంద్రబాబు. సినిమాను అద్యంతం అద్భుతంగా మలిచారంటూ రాజమౌళిని అభినందించిన చంద్రబాబు.. త్వరలోనే ఆ చిత్ర బృందాన్ని అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తానని చెప్పారు.
చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళా తపస్వి కె.విశ్వనాథ్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావటంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. విశ్వనాథ్ కు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇక.. రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అప్పగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలని డిసైడ్ చేశారు. ఈ నిర్ణయంతో పాటు ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్ 1 సర్వీసులో నియమించేందుకు వీలుగా చర్యలు.. కొత్తగా 800 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను గ్రేడ్ వన్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేస్తూ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/