Begin typing your search above and press return to search.
సీన్ రివర్స్ : కేసీఆర్ ఇపుడు టీడీపీరోల్ మోడల్
By: Tupaki Desk | 18 Feb 2017 6:26 AM GMTరాజకీయాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవనేందుకు ఇదే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నోట ఊహించని మాట వెలువడింది. దేశంలోనే గొప్ప రాజకీయవేత్తగా, వ్యూహకర్తగా తనను తాను వర్ణించుకునే చంద్రబాబు ఇపుడు తన జూనియర్ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కేసీఆర్ మార్గం ఉత్తమమైనదని అంటున్నారు. అది కూడా ఏదో అంతర్గత సంభాషణల్లో కాదు. ఏకంగా పార్టీ ముఖ్య నేతలకు నిర్వహించిన వర్క్ షాప్ లో కావడం ఆసక్తికరం.
అమరావతిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ పార్టీ నేతల విధానాలను వివరిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఫోన్ లో చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వర్క్ షాప్ లో ఆయన కులాలు - మతాలు - బంధుత్వాలతో ఓట్లు రాలవంటూ పార్టీ శ్రేణులకు, నాయకులకు హితవు పలికిన సందర్భంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రస్తావించారు. "కేసీఆర్ కులాన్ని బట్టి నాయకుడయ్యారా ? ఆయన కులాన్ని చూసి ఓట్లేశారా ? మోడీ కులముద్రతో ప్రధాని అయ్యారా ? ఇటు వీరు నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడూ ఉంటున్నారు. అందుకే ప్రజలు వారిని తిరుగులేని నాయకులుగా ఆదరిస్తున్నారు. అందుకే నిత్యం ప్రజలతో ఉండాలి. వారి సమస్యల్ని గుర్తించాలి. వాటి పరిష్కారానికి ప్రయత్నించాలి. గతంలోలా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఆ రోజులు పోయాయి. ప్రజలు చైతన్యవంతులయ్యారు" అంటూ చంద్రబాబు పార్టీ నేతలకు తలంటారు. కాగా, చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలోనే కాదు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/