Begin typing your search above and press return to search.

కోదండ‌రామ్‌ కు చంద్ర‌బాబు ప్ర‌శంస‌

By:  Tupaki Desk   |   20 July 2016 9:22 AM GMT
కోదండ‌రామ్‌ కు చంద్ర‌బాబు ప్ర‌శంస‌
X
ఇది ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. మీరు చ‌దివింది నిజ‌మే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు నేతృత్వం వ‌హించిన నేత‌ల్లో ప్ర‌ముఖుడైన విద్యావేత్త ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ ను ఏపీ సీఎం చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన ఆ ఉద్య‌మ నేత‌ను బాబు పొగ‌డ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి చంద్ర‌బాబు కోదండ‌రామ్‌ ను ఎందుకు పొగిడారో? ఆ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందో చూద్దాం.

తెలంగాణ‌లో టీడీపీ నేత‌లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని - ముఖ్యంగా కేసీఆర్‌ ను విమ‌ర్శించ‌డంలో - ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై యాంటీ ప్ర‌చారం చేయ‌డంలో వెనుక‌బ‌డుతున్న‌ట్టు చంద్ర‌బాబు భావించార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే టీ టీడీపీ ఆ రాష్ట్రంలో బాగా వెన‌క‌ప‌డిపోయింద‌న్న నిర్ణ‌యానికి బాబు వ‌చ్చేశారు. దీంతో ఇక్క‌డ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల కోసం ఆయ‌న టీ టీడీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. తెలంగాణ‌లో టీడీపీ సైకిల్‌ను పరుగులు పెట్టించాల‌ని - 2019 ఎన్నిక‌ల్లో అధికారం కైవ‌సం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లాల‌ని - ముఖ్యంగా ప్ర‌భుత్వ వైఖ‌రిని - పాల‌నా లోపాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని అక్క‌డి నేత‌ల‌కు హిత‌బోధ చేశార‌ట‌.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలంగాణ కోసం అహ‌ర‌హం శ్ర‌మించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ విష‌యాన్ని ప్ర‌స్తావించార‌ట‌. తెలంగాణ అంటే అంత ప్రేమ ఉన్న వ్య‌క్తే ఇప్పుడు కేసీఆర్‌ పై విమ‌ర్శ‌లు సంధిస్తున్నార‌ని, పాల‌నా లోపాల‌ను మీడియా ముఖంగా ఎండ‌గడుతున్నార‌ని - అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భాన్ని వినియోగించుకుంటున్నార‌ని వివ‌రించాట‌.

టీఆర్ ఎస్ ప్రభుత్వం తానిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని చెప్పేందుకు కోదండ‌రామ్ విమ‌ర్శ‌లే ఉదాహ‌ర‌ణ అని, ఈ విష‌యాన్ని టీడీపీ నేత‌లు గ‌మ‌నంలో పెట్టుకుని టీఆర్ ఎస్‌ పై విజృంభించాల‌ని దిశానిర్దేశం చేశార‌ట చంద్ర‌బాబు. దిశానిర్దేశం వ‌ర‌కు ఓకే అయిన‌ప్ప‌టికీ.. కోదండ‌రామ్‌ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డ‌మే ఇక్క‌డ చ‌ర్చనీయాంశ‌మైంది. ఏదైనా చంద్ర‌బాబు నిశిత దృష్టికి టీ టీడీపీ నేత‌లు కూడా ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌.