Begin typing your search above and press return to search.
విమర్శలు చేసిన నోటితోనే ఎల్వీని పొగిడిన బాబు
By: Tupaki Desk | 15 May 2019 6:12 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల వాస్తవం నెమ్మదిగా బోధ పడుతోందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఎన్నికల్లో ఓటమిపై ఆయన మానసికంగా సిద్ధమవుతున్నట్లుగా చెప్పక తప్పదు. ఎన్నికల్లో ఇప్పటివరకూ తాను చెప్పినట్లు 120 సీట్లు వచ్చే అవకాశం కాదు కదా.. గెలిచే సీన్ లేదన్న వైనాన్ని బాబు గుర్తించినట్లుగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.
ఆనవాయితీగా నిర్వహించే మహానాడును వాయిదా వేయటం.. దానికి ఆయన చెప్పిన కారణం అతికినట్లుగా లేకపోవటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల వేళ సీఎస్ గా నియమించిన ఎల్వీ సుబ్రహణ్యాన్ని తాజాగా పొగిడిన తీరు చూస్తే.. బాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఎల్వీ ఎంపికను మొదట్నించి వ్యతిరేకించిన చంద్రబాబు ఆయన అనుచర వర్గం దారుణమైన వ్యాఖ్యలు చేసింది.
నేరారోపణలు ఉన్న వారిని సీఎస్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించటంతో పాటు.. ఈసీ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ తో పాటు ఎల్వీ పేరు కూడా ఉందని.. అలాంటప్పుడు ఆయన్ను సీఎస్ గా ఎలా నియమిస్తారన్న ప్రశ్నను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు. ఎల్వీ తీరుపై చంద్రబాబు పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
వాస్తవానికి తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశం కూడా.. ఎల్వీ కంటే తనకున్న అధిక్యతను.. అధిపత్యాన్ని ప్రదర్శించుకోవటానికేనన్న విషయం తెలిసిందే. అలాంటి సమావేశంలో సీఎస్ ఎల్వీ సుబ్రహణ్యం మీద పొగడ్తల వర్షం కురిపించటం గమనార్హం. ఎన్నికల సమయంలో సీఎస్ పని తీరు బాగుందన్న మెచ్చుకోలు బాబుతో పాటు.. ఆయన అనుచర వర్గం చేయటం ఎందుకు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఎన్నికల సంఘం ఎంపిక చేసిన సీఎస్ విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఫీల్ కావటంతో పాటు.. ఈసీ నిర్ణయాన్ని రాజకీయం చేయటంపై గుర్రుగా ఉన్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు కానీ.. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తీసుకొని అధికారుల్ని రచ్చ చేయటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో అధికారగణమంతా గుర్రుగా ఉంది.
పవర్ పోయే వేళలో.. అధికారులతో సున్నం పెట్టుకోవటం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకానున్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఫలితాల లోపే అధికారుల్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ నోటితో అయితే ఎల్వీని తిట్టారో.. అదే నోటితో ప్రసన్నం చేసుకోవటానికి వీలుగా ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. విరుచుకుపడిన వ్యక్తి చేత పొగిడించుకోవటం ఏ అధికారికైనా మహా సంతృప్తికరంగా ఉండటం ఖాయం. అందునా బాబు లాంటి అధినేత నోట పొగడ్తలు హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాయని చెప్పక తప్పదు.