Begin typing your search above and press return to search.
నా కొడుకు చూస్తున్న శాఖ అమోఘం!
By: Tupaki Desk | 17 Feb 2018 4:22 AM GMTపాపం దీనిని డబుల్ బొనాంజా అనడానికి వీల్లేదు. డబల్ డ్యూటీ అనాలి. సొంతడబ్బా కొట్టుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు డబుల్ డ్యూటీ పడిందని ఇప్పుడంతా అనుకుంటున్నారు. ఆయన తనను తాను పొగుడుకోవాలి.. అలాగే కొడుకు లోకేష్ ను కూడా పొగుడుతూ.. నలుగురూ కొడుకు ప్రతిభను గుర్తించేలా పాటుపడాలి. పాపం ఇన్ని బాబుగారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు అనుకుంటున్నారు జనం.
రాష్ట్ర బడ్జెట్ కసరత్తులకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్ కీలక మంత్రులు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రంనుంచి గరిష్టంగా నిధులు పొందగలిగేలా - పొందిన నిధులను సద్వినియోగం చేసి, ఆయా శాఖల్లో సత్ఫలితాలను సాధించేలా కసరత్తు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేయాలని అందరికీ ఆయన మార్గనిర్దేశనం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయే శాఖలు ఎలా పనిచేశాయో కూడా ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేశారు చంద్రబాబు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకున్న శాఖలను ఆయన అభినందించారు. అలాగే తన కొడుకు నారా లోకేష్ పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ అమోఘమైన పనితీరుతో - నిధుల వ్యయంతో అనేక పురస్కారాలు దక్కించుకున్నదని కూడా ఆయన కితాబులు ఇచ్చేశారు.
అవును మరి.. అచ్చంగా నూటికి నూరుశాతం నిధులు కేంద్రం నుంచి నిరంతరాయంగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశం ఉన్న గ్రామీణాభివృద్ధి - పంచాయతీ రాజ్ శాఖను కొడుకు చేతిలో పెట్టిన తర్వాత.. ఆ శాఖలో పనులు జరగకుండా ఎందుకుంటాయ్ అని పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. లడ్డూ లాంటి శాఖను కొడుకు కు కానుకగా ఇవ్వడమే కాదు.. ఆ శాఖను సదా కీర్తిస్తూ.. కొడుకు ప్రతిభను ప్రమోట్ చేసే పనిని కూడా చంద్రబాబే తీసుకున్నాడని పలువురు అంటున్నారు. ప్రమోషన్ విషయంలో చంద్రబాబు కొడుకు కోసం ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న అంబానీ వచ్చినా కొడుకు వెళ్లి స్వాగతించాల్సిందే రేపు సీఐఐ సదస్సు జరిగినా కొడుకు కీలకంగా వ్యవహరించాల్సిందే. అదంతా ఓకే గానీ.. కొడుకు శాఖ ఒక్కటే బాగా పనిచేస్తున్నదని అన్నట్లుగా మాట్లాడడమే బాధగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారట.