Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బాద్షా పై ఏపీ సీఎం ప్రశంసలు!
By: Tupaki Desk | 23 Jan 2018 12:24 PM GMTబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రీల్ లైఫ్ లో తన నటనతో చాలామంది ఫ్యాన్స్ న సంపాదించుకున్నాడు. ఖాన్ త్రయంలో విలక్షణ శైలిని కలిగి ఉన్న షారుక్ రియల్ లైఫ్ లో కూడా హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. షారుక్ `మీర్ ఫౌండేషన్` ను స్థాపించి యాసిడ్ దాడి బాధితులు, క్యాన్సర్ బాధిత చిన్నారులకు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. చీకటి నిండిన వారి బ్రతుకుల్లో షారుక్ వెలుగులు నింపారు. ఆ అసహాయులకు షారుక్ అందిస్తోన్న సేవలకు గుర్తుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం...ఆయనను ఘనంగా సత్కరించింది. బాలలు - మహిళల హక్కుల కోసం షారుక్ సేవలకు `క్రిస్టల్ అవార్డు`తో గౌరవించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో షారుక్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా షారుక్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అయింది.
మహిళలు - బాలల కోసం షారుక్ చేస్తున్న సేవలకు ఏపీ సీఎం చంద్రబాబు ఫిదా అయిపోయారు. ఆ అవార్డు అందుకున్న షారుక్ ను ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశారు. సమాజానికి సేవ చేసేందుకు ఓ రాజకీయ నాయకుడో.. గొప్ప నేతో కానక్లర్లేదని.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి క్రిస్టల్ అవార్డు అందుకున్నందుకు షారుక్ కు అభినందనలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. షారుక్ చేస్తున్న కృషి ప్రశంశనీయమని - భవిష్యత్తులో కూడా ఇలాగే పలు అవార్డులు అందుకోవాలని కోరారు. అవార్డు తీసుకున్న తర్వాత షారుక్ ప్రసంగించారు. తన తల్లి - సోదరి - భార్య - పిల్లల నుంచి తాను అనేక విలువలను నేర్చుకున్నానని చెప్పారు. ఎవరికి తోచిన విధంగా వారు ఉన్నంతలో ఇతరులకు సాయం చేయడంలో అసలైన ఆనందం ఉందన్నారు. తనను గుర్తించి అవార్డును అందించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం - జైహింద్ అంటూ షారుక్ తన ప్రసంగాన్ని ముగించారు. షారుక్ తో పాటు కేట్ బ్లాంచెట్ - ఎల్టన్ జాన్ లు కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.